Begin typing your search above and press return to search.
వేరొకరి ఛాన్స్ అలా లాక్కున్నాడట
By: Tupaki Desk | 11 May 2019 6:08 AM GMTనేచురల్ స్టార్ నాని.. అథ్లెటిక్ హీరో సుధీర్ బాబు కథానాయకులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వీ` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా ప్రారంభమైంది. టైటిల్ సహా కాస్టింగ్ వివరాల్ని చిత్రయూనిట్ ప్రకటించింది. నాని ఇందులో ప్రతినాయక పాత్రలో నటిస్తుండగా సుధీర్ బాబు పోలీస్ అధికారికగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో పోలీస్ రోల్ కోసం సుధీర్ బాబు తొలి ఆప్షన్ కానే కాదని తెలుస్తోంది. అసలు ఈ సినిమాలో సుధీర్ బాబుకు అవకాశం ఎలా లభించింది? ఇదే ప్రశ్న తననే అడిగితే అతడు చెప్పిన సంగతి ఇదీ.
`సమ్మోహనం` సినిమా తర్వాత దర్శకుడు ఇంద్రగంటిని వేరొక స్క్రిప్టు కావాలని వెళ్లి కలిశాను. అయితే అప్పటికే ఆయన ఎంపిక చేసుకున్న స్క్రిప్టులో వేరే వాళ్లను అనుకుంటున్నారు. నేను కలవగానే ఓ పాత్రకు నేను సరిపోతాను అని భావించి వెంటనే ఓకే చేశారు. అలా నేను `వీ` ప్రాజెక్టులో భాగం అయ్యాను అని తెలిపారు. సుధీర్ చెప్పిన దానిని బట్టి వాస్తవానికి ఆ పాత్రలో వేరొక హీరోని అనుకున్నారు. కానీ సుధీర్ తనకు తానుగానే వెళ్లి కలవగానే ఆ అవకాశం దక్కిందని అర్థమవుతోంది. అయితే అవకాశం కోల్పోయిన ఆ హీరో ఎవరు? అన్న చర్చా ఇప్పుడు వేడెక్కిస్తోంది.
ఇకపోతే సుధీర్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ `భాఘి 2` ఛాన్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చెప్పారు. వాస్తవానికి భాఘి 2 చిత్రంలో విలన్ రోల్ ఆఫర్ చేయగానే తాను అసలు ఆ చిత్రంలో నటించలేనని చెప్పేందుకు సాజిద్ నడియావాలా బృందాన్ని కలిశాడట. అయితే కథ విన్న తర్వాత అద్భుతంగా ఉందని భావించి వెంటనే ఓకే చెప్పేశాడట. `భాఘి 2` చిత్రంలో నటించిన హీరో టైగర్ ష్రాఫ్ కి ఎంత పేరొచ్చిందో అంతకుమించిన పేరు విలన్ గా నటించిన సుధీర్ బాబుకు దక్కిన సంగతి తెలిసిందే. స్క్రిప్టులు ఎంపిక చేసుకోవడంలో మహేష్ తనకు స్ఫూర్తి అని సుధీర్ బాబు తెలిపారు. ఇది కావాలి.. అది కావాలి అని అడగను. నా వైపు వచ్చిన వాటిలో బెస్ట్ ఏవో ఎంపిక చేసుకుంటానని ఆ విషయంలో బావ మహేష్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. నేడు సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు.