Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ అన్ని సినిమాలు ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు?

By:  Tupaki Desk   |   8 Dec 2022 3:49 AM GMT
ప్ర‌భాస్ అన్ని సినిమాలు ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు?
X
టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా వున్నారు. కొంత మంది అంగీక‌రించిన సినిమాల‌కు డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక పోతున్నారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ షూటింగ్ ల‌కు ఎక్క‌డా బ్రేక్ ప‌డ‌కుండా ప్లాన్ చేసుకుంటున్న తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ..మ‌రీ ముఖ్యంగా అభిమానుల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంద‌ట‌. వివ‌రాల్లోకి వెళితే...ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

'కేజీఎఫ్‌' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో 'స‌లార్‌' మూవీ చేస్తున్నారు. ఇది దాదాపుగా చివ‌రి ద‌శ‌కు చేరుకుంటోంది. దీనితో పాటు బాలీవుడ్ డైరెక్ట‌ర్ తో చేసిన మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆది పురుష్‌' షూటి్గ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా గ్రాఫిక్స్ కి సంబంధించిన రీవ‌ర్క్ జ‌రుగుతోంది.

రీసెంట్ గా విడుద‌ల చేసిన టీజ‌ర్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో మేక‌ర్స్ దాదాపు మ‌రో రూ. 100 కోట్లు బ‌డ్జెట్ కేటాయించి వీఎఫ్ ఎక్స్ రీవ‌ర్క్ ని స్టార్ట్ చేశారు.

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇక ఇదే టైమ్ లో ప్ర‌భాస్ మ‌రో పాన్ వ‌ర‌ల్డ్ మూవీని చేస్తున్నాడు. 'మహాన‌టి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ తెర‌కెక్కుతున్న మూవీ 'ప్రాజెక్ట్ కె'. ట్రైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్ష‌న్ గా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నాడు. బాలీవుడ్ క్రేజీ న‌టీన‌టులు న‌టిస్తున్న ఈ మూవీ కూడా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో వుంది. దీపికా ప‌దుకునే మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా దిషా ప‌టాని క‌నిపించ‌బోతోంది.

కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. వ‌రుస‌గా ఈ మూడు ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తూ ఎక్క‌డా ఏ మూవీ షూటింగ్ ని కూడా ఆప‌కుండా బ్యాక్ టు బ్యాక్ ప‌రుగులు పెట్టిస్తున్నాడు.

ఇంత బిజీ షెడ్యూల్ లోనూ మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ తాజాగా మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం తెలిసిందే. హారర్ థ్రిల్ల‌ర్ స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ మూవీని ఫ్యాన్స్ వ‌ద్దు బాబోయ్ అని వారిస్తున్నా స‌రే మారుతిపై వున్న న‌మ్మ‌కంతో ప్ర‌భాస్ అంగీక‌రించి మొత్తానికి సైలెంట్ గా ప‌ట్టాలెక్కించేశాడు.

ఓ థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే హార‌ర్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కిస్తున్నాడు. రాకెట్ స్పీడుతో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. తాజాగా ఈ గురువారం నుంచి తాజా షెడ్యూల్‌ని ప్రారంభించ‌బోతున్నారు. ఇత‌ర హీరోలు ఒక్క సినిమాకే డేట్స్ కేటాయించ‌లేకుండా స‌త‌మ‌త‌మ‌వుతున్న వేళ ప్ర‌భాస్ అన్ని సినిమాలు ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు?.. ఎలా డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడ‌న్న‌ది ఇస్పుడు హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.