Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ బ్రాండ్స్ రెవెన్యూ ఎంత‌?

By:  Tupaki Desk   |   14 July 2020 9:30 AM IST
యంగ్ టైగ‌ర్ బ్రాండ్స్ రెవెన్యూ ఎంత‌?
X
బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ లో మ‌హేష్ - బ‌న్ని- చ‌ర‌ణ్ జ‌రంత స్పీడ్ గానే ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రేంజ్ ఏమాత్రం త‌క్కువేమీ కాదు. సైలెంట్ గా ఒక్కో బ్రాండ్ ని ఖాతాలో వేసుకుంటూ భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంటూ తార‌క్ బాగానే ఆర్జిస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో నవరతన్ హెయిర్ ఆయిల్.. అప్పీ ఫిజ్ వంటి వివిధ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నారు. సెలెక్ట్ మొబైల్స్ కి ప్ర‌చార‌క‌ర్త‌గా కొన‌సాగారు. ఇటీవ‌ల‌ ఒట్టో అనే బట్టల బ్రాండ్ ‌కు అంబాసిడర్‌గా సంతకం చేశారు. ఆ బ్రాండ్ టీవీ ప్ర‌క‌ట‌న‌ ప్రచారం వేడెక్కించింది. ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ఈ యాడ్ ని షూట్ చేశారు.

అలాగే ప్ర‌ఖ్యాత సెలెక్ట్ మైబైల్ ఫ్రాంఛైజీల విస్త‌ర‌ణ‌కు తార‌క్ ప్ర‌మోష‌న్ ఓ రేంజులోనే క‌లిసొస్తోంది. ఈనెల 17న విజ‌య‌వాడ‌లో కొత్త శాఖను ఎన్టీఆర్ ప్రారంభించనున్నారని స‌మాచారం. తార‌క్ ప్ర‌త్యేకించి ఓ చార్టెడ్ ఫ్లైట్ లో ఇక్క‌డికి చేరుకునే అవ‌కాశం ఉందిట‌. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో మ‌హ‌మ్మారీ ప్ర‌భావం అంత‌కంత‌కు ఉధృత‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే తారక్ కి సెక్యూరిటీ విష‌య‌మై త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. ఫేమ‌స్ కంపెనీల బ్రాండ్ కాంట్రాక్టులు తార‌క్ చేతిలో ఉన్నాయి. అత‌డికి బ్రాండ్స్ ప‌రంగా ఆదాయం ఆ రేంజులోనే ఉండ‌నుందన్న‌ది ఓ అంచ‌నా. ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటే త్రివిక్ర‌మ్ తో సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంది. కానీ మ‌హ‌మ్మారీ శాంతించ‌క‌పోవ‌డం షూటింగుల‌కు అడ్డంకిగా మారింది.