Begin typing your search above and press return to search.

సమంతకు 'శాకుంతలం' ఇంత ఇష్టమా?

By:  Tupaki Desk   |   19 March 2021 2:30 PM GMT
సమంతకు శాకుంతలం ఇంత ఇష్టమా?
X
గుణశేఖర్‌ దర్శకత్వంలో సినిమా అంటే స్టార్‌ హీరోలు బాబోయ్‌ అంటూ మొహం చాటేస్తున్నారు.. లేడీ ఓరియంటెడ్‌ చిత్రం తీద్దాం అనుకున్నా కూడా స్టార్‌ హీరోయిన్స్ ఆసక్తి చూపడం లేదు అనే టాక్ చాలా కాలంగా వినిపస్తుంది. రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్‌ ఎట్టకేలకు సమంతతో శాకుంతలం సినిమా ను మొదలు పెట్టాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన గుణశేఖర్‌ త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్ కు సినిమాను తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. పలువురు హీరోయిన్స్ నో చెప్పిన శాకుంతలం సినిమాకు సమంత ఓకే చెప్పడం చాలా మందికి ఆశ్చర్యంను కలిగిస్తోంది.

సమంత 'శాకుంతలం' కు ఓకే చెప్పడం వెనుక ఎవరో ఉన్నారనే టాక్‌ వినిపిస్తుంది. కాని సమంత సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమా కథ మరియు తన పాత్ర నచ్చడం వల్లే ఆమె ఒప్పుకుందని అంటున్నారు. శాకుంతలం ప్రాజెక్ట్‌ ను ప్రకటించిన సమయంలో సమంత ఈ సినిమాలో నటిస్తుందని ఏ ఒక్కరు అనుకోలేదు. శాకుంతలం కాన్సెప్ట్‌ నచ్చడం వల్లే ఒప్పుకుంది. అంతే కాదు సమంత లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు మూడు కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటూ ఉంటుంది. కాని శాకుంతలం సినిమాకు మాత్రం రూ.2.5 కోట్ల ను మాత్రమే పారితోషికంగా తీసుకుంటుందట. శాకుంతలం ప్రాజెక్ట్‌ అంటే సమంతకు ఎంత ఇష్టమో రూ.50 లక్షల పారితోషికంను తగ్గించడం ద్వారా అర్థం అవుతుంది.