Begin typing your search above and press return to search.

మామ ర‌జ‌నీని అల్లుడు ధ‌నుష్ ఎన్నిసార్లు కాపీ కొట్టారు?

By:  Tupaki Desk   |   14 Jun 2021 4:53 AM GMT
మామ ర‌జ‌నీని అల్లుడు ధ‌నుష్ ఎన్నిసార్లు కాపీ కొట్టారు?
X
కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ త‌న మామ గారైన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని ఇమ్మిటేట్ చేయ‌రా? అస‌లు ఆయ‌న‌ను ఎప్పుడూ కాపీ చేయ‌లేదా? అంటే .. ఇప్ప‌టికి 5 సార్లు ధనుష్ తలైవర్ ను కాపీ చేసారు.. య‌థాత‌థంగా సీన్ ని దించేయ‌క పోయినా కానీ ర‌జ‌నీ ఆహార్యంలో సిగ‌రెట్ తాగే స్టైల్ .. సూట్ ధ‌రించే స్టైల్.. న‌డిచే న‌డ‌క ఆహార్యం ఇలా కొన్నిటిని కాపీ చేశారు సంద‌ర్భాన్ని బ‌ట్టి. ఇప్పుడు ఆరోసారి కూడా కాపీ కొడుతున్నాన‌ని ధ‌నుష్ స్వ‌యంగా తెలిపారు.

నిజానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆయ‌న అనుస‌రించాల‌నుకోవ‌డానికి కార‌ణం ఏమిటి? అంటే త‌న ద‌ర్శ‌కుల ప్రోద్భ‌ల‌మే. త‌న‌కు అది ఇష్టం లేక‌పోయినా ద‌ర్శ‌కులు కోరితే కాద‌న‌లేడ‌ట‌. ప్ర‌స్తుతం `జగమే తందిరం` సినిమా కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఎలాగైనా రజినీకాంత్ మేనరిజమ్ కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టార‌ట‌. అత‌డు బలవంతం పెట్టడంతో అతని మాటను కాదనలేకపోయాడ‌ట‌. ఈ తమిళ చిత్రం ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న సంద‌ర్భంగా ధ‌నుష్ మాట్లాడుతూ.. ఎప్పుడూ పూర్తి కాపీ లేదు కానీ ఈసారి త‌ప్ప‌లేద‌ని అన్నారు.

కొన్నేళ్లుగా తమిళ సినిమాలోని చాలా మంది నటులు తమ సినిమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ను అనుకరించడానికి ప్రయత్నించారు. కానీ ఘోరంగా విఫలమయ్యారు. తెరపై రజనీకాంత్ ముద్ర వేయడంలో ఇతరులకన్నా ఒక అంగుళం దగ్గరగా వచ్చిన ఏకైక‌ నటుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే ర‌జ‌నీ అల్లుడు ధనుష్ మాత్ర‌మే. శింబు లాంటి స్టార్లు చాలాసార్లు ర‌జ‌నీని అనుక‌రించినా దానిపై విమ‌ర్శ‌లొచ్చాయి కానీ ర‌జ‌నీ అభిమానులు ఏనాడూ పొగ‌డ‌లేదు.

ద‌ళ‌పతి (1991) లో రజనీకాంత్ సీన్ ని పొల్లాధవన్ లో ధనుష్ (2007) అనుక‌రించారు. అందుకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. 2007 హిట్ పొల్లాధవన్ ల సీన్ కి కాపీ అనేది స్పష్టంగా కనిపించింది. ముల్లం మలరం (1978) లో రజనీకాంత్ చేసిన ఓ సీన్ ని వేలై ఇల్లా పట్టాధారి (2014) లో ధనుష్ అనుక‌రించారు. అన్నామలై (1992) లో రజనీకాంత్ మ్యాన‌రిజ‌మ్‌ ని మరియన్ లో ధనుష్ (2013) ఇమ్మిటేట్ చేశారు. మురట్టు కలై (1980) లో సీన్ ని మారిలో ధనుష్ (2015) అనుక‌రించారు. హిందీ చిత్రం షమితాబ్ లో ధనుష్ రాగ్-టు-రిచెస్ పాత్రను పోషిస్తున్నాడు. ధనుష్ పాత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధారంగా ఉందని ప్ర‌చార‌మైంది. 2013 చిత్రం రాంజానా ప్రమోషన్ల సమయంలో ధనుష్ వాస్తవానికి ముందుకు వెళ్లి తన చిత్రాలలో రజనీకాంత్ ను అనుకరించబోనని మీడియాతో అన్నారు. అయితే మారి 2015 లో అనుక‌రించక త‌ప్ప‌లేదు. ర‌జ‌నీలా సిగ‌రెట్ కాల్చాల‌న్నా.. సిగ‌రెట్ ని గాల్లో ఎగ‌రేసి పెద‌వి అంచుపై నిల‌బెట్టాల‌న్నా వందేళ్ల సినిమా చ‌రిత్ర‌లో ఎవ‌రూ చేయ‌నే లేదు. చేయ‌లేరు కూడా!!