Begin typing your search above and press return to search.

ఏంటీ ఈ వీడియోలు.. క్వారంటైన్ బోర్‌ కొడుతుందా?

By:  Tupaki Desk   |   23 May 2021 11:30 PM GMT
ఏంటీ ఈ వీడియోలు.. క్వారంటైన్ బోర్‌  కొడుతుందా?
X
ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌ మన్‌.. ఐపీఎల్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ టిక్ టాక్ వీడియోలు మరియు ఇన్‌ స్టాగ్రామ్‌ రీల్స్ సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్ అనే విషయం తెల్సిందే. గత ఏడాది పలు ఇండియన్ సినిమాలకు ముఖ్యంగా తెలుగు పాటలకు టిక్ టాక్ వీడియోలను చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. భార్య పిల్లలతో కూడా కలిసి డేవిడ్ వార్నర్‌ తెలుగు పాటలకు వీడియోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కొన్ని సార్లు తాను స్వయంగా డాన్స్ చేస్తూ ఉంటాడు మరి కొన్ని సార్లు స్టార్స్‌ డాన్స్ వీడియో బిట్ లను సేకరించి వాటిని మార్ఫింగ్‌ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం వార్నర్‌ రాములో రాముల వీడియో ట్రెండ్డింగ్ లో ఉంది. ఆ వీడియోకు వార్నర్‌ భార్య కాండీ స్పందించింది.

ఐపీఎల్‌ క్యాన్సిల్‌ అవ్వడంతో ఇటీవలే క్రీడాకారులు అంతా కూడా సొంత ప్రాంతంకు వెళ్లి పోయారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా తమ దేశంను చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆటగాళ్లు అంతా కూడా సిడ్నీలోని ఒక హోటల్‌ లో 14 రోజులు క్వారెంటైన్‌ లో ఉండాల్సి వచ్చింది. క్వారంటైన్‌ టైమ్‌ ను వార్నర్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ద్వారా టైమ్‌ ను గడుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాములో రాముల పాట లోని అల్లు అర్జున్‌ ఫేస్ ను మార్ఫింగ్‌ చేసి తన ఫేస్ ను పెట్టిన వార్నర్‌ వీడియో షేర్‌ చేయడం జరిగింది.

ఆ వీడియో పై కాండీ స్పందిస్తూ.. క్వారెంటైన్‌ లో బోర్‌ కొడుతుందా. వీడియోలు వరుసగా చేస్తున్నావు అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. భార్య కామెంట్స్ కు స్పందించిన వార్నర్ నా 14 రోజుల క్వారెంటైన్‌ ముగియబోతుంది. నా టార్చర్ ను భరించేందుకు సిద్దంగా ఉండూ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇద్దరి మద్య సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.