Begin typing your search above and press return to search.

సాహోకి ఎంతమంది కొట్టారు ?

By:  Tupaki Desk   |   4 July 2019 6:51 AM GMT
సాహోకి ఎంతమంది కొట్టారు ?
X
తాజ్ మహల్ కు రాళ్ళెత్తిన కూలీల పేర్లు చెప్పడం అంత కష్టంగా మారింది సాహోకి పని చేసిన సంగీత దర్శకుల పేర్లు చెప్పడం. ప్రాజెక్ట్ మొదలైన రెండేళ్ల కాలం నుంచి వినిపించిన పేర్లు శంకర్ ఎహసాన్ లాయ్. విడుదల ఇంకో రెండు నెలల్లో ఉందనగా ఉన్నట్టుండి పక్కకు తప్పుకున్నారు. అసలు ఒకటో రెండో పాటలైనా కంపోజ్ చేశారా లేక ఊరికే ఇన్నాళ్లు పేరు వేయించుకుని హడావిడి చేశారా లాంటి క్లారిటీ అటు మేకర్స్ కానీ ఇటు ఈ ముగ్గురు కానీ ఇవ్వలేదు.

కట్ చేస్తే టీజర్ వచ్చాక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తోంది జిబ్రాన్ అని తెలిసింది. సరే కుర్రాడు అదరగొట్టాడు ఇక పాటల సంగతి చూద్దాం అని అభిమానులు వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఆ క్షణాలు వచ్చేశాయి. ఆడియోలోని మొదటి సింగల్ సైకో సయాన్ ట్రాక్ రిలీజ్ కు రెడీ గా ఉంది. దాని తాలూకు పోస్టర్స్ లో సంగీత దర్శకుడి పేరు ఇవ్వలేదు కానీ ఆ ట్యూన్ కంపోజ్ చేసింది తనిష్క్ బాఘ్చీ అని తెలిసింది. పోనీ ఇతగాడే అన్ని పాటలు కంపోజ్ చేశాడా అంటే అదీ లేదట.

వేరే ట్రాక్స్ వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో చేయించారట. అన్ని పాటలు వస్తే కానీ దీనికి సంబంధించిన క్లారిటీ రాదు కానీ అప్పటిదాకా వేచి చూడాల్సిందే. ఒకవేళ అదే నిజమైతే ఇంత పెద్ద స్టార్ హీరో సినిమాకు ఇందరేసి సంగీతం ఇవ్వడం ఇదే మొదటిసారి అవుతుంది. అసలు టోటల్ గా ఎన్ని పాటలు ఉన్నాయో కూడా తెలియదు. మొత్తానికి సినిమాలో స్టోరీ కన్నా ముందే అంతకు మించిన ట్విస్టులు సాహోకు బయటే దొరికేస్తున్నాయి