Begin typing your search above and press return to search.

ఏది క్రియేటివిటీ.. సీనియ‌ర్ గాయ‌ని క్లాస్!

By:  Tupaki Desk   |   3 Sep 2019 2:59 PM GMT
ఏది క్రియేటివిటీ.. సీనియ‌ర్ గాయ‌ని క్లాస్!
X
ఒక‌రిని అనుక‌రించ‌డం క్రియేటివిటీనా? కాపీ కొట్ట‌డం క్రియేటివిటీ ఎలా అవుతుంది? ఒరిజినాలిటీతో క‌నిపిస్తేనే అది క్రియేటివిటీ అని క్లాస్ తీస్కున్నారు సీనియ‌ర్ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్. ఎవ‌రినీ అనుక‌రించాల‌ని అనుకోకూడ‌దు. అది క్రియేటివిటీ కానే కాద‌ని ల‌తాజీ క్లాస్ తీస్కోవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒక‌రిని అనుక‌రించ‌డం ప్ర‌తిభ కానేకాద‌ని ల‌తాజీ కాస్తంత సీరియ‌స్ స్వ‌రం తోనే అన‌డం న‌వ‌త‌రం గాయ‌నీ గాయ‌కుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇటీవ‌లే కోల్ క‌త్తా రైల్వే స్టేష‌న్ లో వెలుగు చూసిన గాయ‌ణి ర‌ణు .. ల‌తా మంగేష్క‌ర్ పాట‌ల్ని అనుక‌రిస్తూ పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. హిమేష్ రేష‌మియా స‌హా ప‌లువురు బాలీవుడ్ లో పాడాల్సిందిగా అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తున్నారు. కండ‌ల హీరో స‌ల్మాన్ సైతం త‌న‌కు ఇల్లు లేద‌ని తెలిసి ముంబైలో 50ల‌క్ష‌ల ఖ‌రీదైన ఇంటిని కొని ఇచ్చారని తెలుస్తోంది. అయితే ర‌ణుపై ల‌తాజీ స్పంద‌న ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే అందులో చాలా ప‌ర‌మార్థం ఉంద‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

``నా పేరు ఉప‌యోగించుకుని ఎవ‌రైనా బాగు ప‌డితే సంతోష‌మే. కానీ ఒక‌రిని అనుక‌రించ‌డం ప్ర‌తిభ అనిపించుకోద‌``ని ల‌తాజీ విమ‌ర్శించారు. ఇలాంటివి టెంప‌ర‌రీ మాత్ర‌మే. కిశోర్ కుమార్- మహమ్మద్ రఫి- ఆశా భోంస్లే పాట‌ల్ని అనుక‌రించి నేటిత‌రం పాడితే ఆ పేరు ఎక్కువ కాలం నిల‌వ‌దు. ఒరిజినాలిటీ ముఖ్యం అని అన్నారు. ఈ త‌ర‌హా ఎంద‌రు స‌క్సెస‌య్యారో చెప్ప‌గ‌ల‌రా? అలా సక్సెస్ అయివారిలో నాకు సునిధి చౌహాన్- శ్రేయా ఘోషల్ పేర్లు మాత్ర‌మే గుర్తున్నాయి.. అంటూ ఆ ఇద్ద‌రిపైనా ల‌తాజీ పెద్ద పంచ్ వేశారు. ఇక త‌న సోద‌రి ఆశా భోంస్లే సైతం త‌న‌ని అనుక‌రించ‌కుండా సొంతంగా ఎదిగింద‌ని కితాబివ్వ‌డం ఆస‌క్తిక‌రం. ప్ర‌తి గాయ‌నీగాయ‌కుడికి త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రి అని ల‌తాజీ అన్నారు. ఇదొక్క‌టే కాదు.. తాము ఆల‌పించిన పాత పాట‌ల్ని రీమిక్స్ పేరుతో పాడు చేస్తున్నార‌ని.. అవి పాడేప్పుడు క‌నీస‌మాత్రంగా అయినా త‌మ‌ను సంప్ర‌దించ‌డం లేద‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అలనాటి గాయకులు రఫీ, కిశోర్ కుమార్ వంటి వారు పాడిన పాటలను రీమిక్స్‌ లుగా మార్చి కొత్త పాటలుగా ప్రేక్షకులకు పరిచయం చేయ‌డం స‌రికాద‌ని మండిపడ్డారు. ఇత‌రులను కాపీ కొట్టొద్దు... అనుక‌రించొద్దు. అవి రెండూ చేస్తే ఒరిజినాలిటీ లేన‌ట్టే. దాని వ‌ల్ల క్రియేటివిటీ బ‌య‌ట‌ప‌డదనేది ల‌తాజీ ఆవేద‌న. న‌వ‌త‌రం అలా చేయొద్ద‌ని సూచించారు. ఇక సీనియారిటీని గౌర‌వించ‌లేద‌న్న ఆవేద‌న ల‌తాజీ మాటల్లో వినిపించింది.