Begin typing your search above and press return to search.

కమల్ వద్దంటేనే విక్రమ్ తీసుకున్నాడు

By:  Tupaki Desk   |   7 Feb 2019 11:31 AM IST
కమల్ వద్దంటేనే విక్రమ్ తీసుకున్నాడు
X
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న నటుడు చియాన్ విక్రమ్. అపరిచితుడు టైంలో మన స్టార్ హీరోలకు ధీటుగా ఓపెనింగ్స్ రాబట్టే రేంజ్ కు చేరుకున్న విక్రమ్ ఆ తర్వాత వరస పరాజయాలతో కథల ఎంపికలో చేసిన పొరపాట్లతో భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. తాజాగా విక్రమ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి గౌతమ్ మీనన్ ధ్రువ నచ్చతిరం కాగా రెండోది కమల్ హాసన్ నిర్మిస్తున్న కడరం కొండెన్.

రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ కడరం కొండేన్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇందులో కమల్ రెండో కూతురు అక్షర హాసన్ తో పాటు నాజర్ నట వారసుడు అన్బు హుసేన్ తెరంగేట్రం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది ముందు అనుకున్నది కమల్ కే. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా తాను చేయలేను అని చెప్పి విక్రమ్ అయితే బెస్ట్ ఛాయస్ గా నిలుస్తాడని చెప్పడం ఇది కాస్త చియాన్ ను వరించింది.
కమల్ తన స్వంత బ్యానర్ లో నిర్మించిన సినిమాల్లో కేవలం తాను కాకుండా ఇప్పటిదాకా ముగ్గురు మాత్రమే బయటి హీరోలు నటించారు.

ఒకరు నాజర్ రెండు మాధవన్ మూడు సత్య రాజ్. ఇప్పుడు నాలుగో హీరో విక్రమ్. పూర్తిగా మలేషియాలో చిత్రీకరించిన ఈ కడరం కొండెన్ కు జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్ తాలూకు అప్ డేట్స్ లేవు. సాధారణంగా తన స్వంత సినిమాలు ఏ బాష అయినా కమల్ స్వయంగా రిలీజ్ చేసుకుంటాడు. ఇంకా దీని తెలుగు టైటిల్ కూడా డిసైడ్ చేయలేదు. వేసవిలో ప్లాన్ చేసిన ఈ మూవీ టీజర్ ఇప్పటికే యాక్షన్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. లోకనాయకుడు కోరి మరీ విక్రమ్ తో ఈ సినిమా చేస్తున్నాడు అంటే అంతే స్పెషల్ ఏముందో వేచి చూడాలి