Begin typing your search above and press return to search.

సీక్వెల్ పై క్రేజ్ ఎలా ఉందంటే.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది..!

By:  Tupaki Desk   |   26 Dec 2022 2:35 PM GMT
సీక్వెల్ పై క్రేజ్ ఎలా ఉందంటే.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది..!
X
కొన్ని కాంబినేషన్స్ సినిమాలు చాలా క్రేజీగా ఉంటాయి. అవి అలా సెట్ అయితే చాలు సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతుంటారు. కార్తీ మొదటి సినిమా తెలుగు వారికి పరిచయమైన సినిమా యుగానికి ఒక్కడు. సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాకు తెలుగులో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత యుగానికి ఒక్కడు సినిమాకు సీక్వెల్ ప్రకటించారు సెల్వ రాఘవన్. అయితే ఆ సీక్వెల్ లో హీరోని మార్చేశాడు.

కార్తీకి బదులుగా ధనుష్ ని హీరోగా తీసుకున్నారు. యుగానికి ఒక్కడు 2 సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడని ప్రకటించారు. ఆ టైం లో కార్తీ ఫ్యాన్స్ కొద్దిగా అప్సెట్ అయ్యారు. లేటెస్ట్ గా యుగానికి ఒక్కడు 2 ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి సిద్ధం చేశారు. అందులో ధనుష్ తో పాటుగా కార్తీ కూడా ఉండేలా పోస్టర్ డిజైన్ చేశారు. ఒకవేళ సెల్వ రాఘవన్ ఇలా ఏమైనా కార్తీ పాత్రని సీక్రెట్ గా ప్లాన్ చేశారా అన్నది తెలియదు కానీ ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రం అదిరిపోయింది.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యుగానికి ఒక్కడు 2 ఫ్యాన్ మేడ్ పోస్టర్ గురించి డిస్కషన్స్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ భారీ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. ధనుష్ తో పాటు కార్తీ కూడా ఈ సినిమాలో ఉంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది. ధనుష్, కార్తీ ఇద్దరికి తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి యుగానికి ఒక్కడు 2 ఈసారి సెన్సేషన్ సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

ఈ సినిమా కేవలం తెలుగు, తమిళం మాత్రమే కాదు పాన్ ఇండియా లెవల్లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సెల్వ రాఘవన్ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. సినిమాని 2024లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కార్తీ, ధనుష్ ఇద్దరు తమ తమ సినిమాలతో సూపర్ ఫాం లో ఉండగా నిజంగానే యుగానికి ఒక్కడు 2 లో కార్తీ ఉంటే మాత్రం ఆ సినిమాకు మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.