Begin typing your search above and press return to search.

ఇంతకీ భారత్ ఎలా ఉన్నాడు ?

By:  Tupaki Desk   |   6 Jun 2019 5:48 AM GMT
ఇంతకీ భారత్ ఎలా ఉన్నాడు ?
X
నిన్న ఈద్ పండగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సల్మాన్ ఖాన్ భారత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ దక్కించుకుంది. నిన్నే రంజాన్ వేడుక రావడంతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఓపెనింగ్స్ పరంగా రికార్డు ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తోంది. అయితే నిజంగా భారత్ లో అంత విషయం ఉందో లేదో ఓ లుక్ వేద్దాం. 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు లాహోర్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ట్రైన్ లో భారత్ తన అమ్మా చెల్లితో వచ్చేస్తాడు. ఆ క్రమంలో నాన్న అక్కకు దూరం కావాల్సి వస్తుంది.

ఎంత ప్రయత్నించినా వాళ్ళ ఆచూకి తెలుసుకోలేకపోతాడు. ఆ తర్వాత పాతికేళ్ళ నుంచి యాభై ఏళ్ళ దాకా రకరకాల ఉద్యొగాలు చేస్తూ కష్టనష్టాలు భరిస్తూ చివరికి తన వాళ్ళ ఆచూకి తెలుసుకున్నాడా లేదా అనేదే భారత్ కథ. మధ్యలో ఎంప్లొయ్ మెంట్ ఆఫీసర్ కత్రినాతో లవ్ స్టొరీ అదనం. ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత్ అనే వ్యక్తి బయోపిక్ ఇది. ఐదేళ్ళ క్రితం వచ్చిన కొరియన్ మూవీ ఓడే టు మై ఫాదర్ కు అఫీషియల్ రీమేక్ గా రూపొందిన భారత్ ఓ సాగదీసిన ఎమోషనల్ జర్నీగా చెప్పొచ్చు.

దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ హంగుల మీద సల్మాన్ బిల్డప్ మీద పెట్టిన దృష్టి కథనం మీద పెట్టలేదు. ఫలితంగా భారత్ భారంగానే అనిపిస్తుంది. సల్మాన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇచ్చే అంశాలు ఉన్నప్పటికీ సగటు ప్రేక్షకులకు మాత్రం భారత్ సహనానికి పరీక్షగా పెట్టాడు. కళ్ళు చెదిరే బడ్జెట్ మంచి పాటలు ఇవన్ని ఉన్నాయి కాబట్టి కొంతమేర కాపాడాయి కాని మొత్తం వన్ మ్యాన్ షోగా సాగిన భారత్ లో మరీ ఎక్కువ ఆశించడానికి లేకుండా పోయింది. తండ్రికి ఇచ్చిన మాట అనే పాయింట్ మీద భారత్ జీవన ప్రయాణాన్ని తెరమీద ఎగ్జైటింగ్ గా చూపించాల్సింది పోయి ఫ్లాట్ గా చెప్పుకుంటూ పోవడంతో ఎక్కువ కనెక్ట్ కాలేక చప్పగా సాగిపోయింది.

కత్రినా కైఫ్ డీసెంట్ రోల్ లో కొంచెం కొత్తగా అనిపించింది కాని ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఎలాంటి మార్పు లేదు. దిశా పటాని కేవలం ఓ పాట రెండు సీన్లకే పరిమితం. హీరోతో చేసిన ఫ్రెండ్ పాత్రధారి తప్ప ఇంకెవరు రిజిస్టర్ కారు. గత రెండు రంజాన్ లకు వచ్చిన రేస్ 3-ట్యూబ్ లైట్ లకంటే కొంత నయం అనిపిస్తుంది కాని భారత్ విడిగా చూస్తే మాత్రం కేవలం సల్మాన్ చరిష్మా మీద కలెక్షన్లు రాబట్టాల్సిందే తప్ప కంటెంట్ తో మెప్పించడం కష్టమే