Begin typing your search above and press return to search.

రవిబాబు అడల్ట్ 'క్రష్' ఎలా ఉందంటే..!

By:  Tupaki Desk   |   10 July 2021 2:30 AM GMT
రవిబాబు అడల్ట్ క్రష్ ఎలా ఉందంటే..!
X
'అల్లరి' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నటుడు రవిబాబు.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవిబాబు.. తన1కెరీర్ ఆరంభంలో హిట్ ఇచ్చిన జోనర్ తీసుకొని ''క్రష్'' అనే సినిమాని రూపొందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవిబాబే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఆ మధ్య ఒకటీ అర పోస్టర్స్ వదులుతూ ప్రమోషన్స్ చేసిన రవిబాబు.. ఈ చిత్రాన్ని సైలెంట్ గా రిలీజ్ చేశారు. ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ మాత్రమే వదిలి జీ5 ఓటీటీలో 'క్రష్' సినిమాని విడుదల చేసారు.

ఇదొక యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని చెబుతూ వస్తున్నప్పటికీ.. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం 'క్రష్' లో రొమాన్స్ మాత్రమే ఉందని అంటున్నారు. కథ విషయానికొస్తే.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ముగ్గురు కుర్రాళ్లు.. సెలవుల్లో అమెరికా నుంచి వచ్చిన తమ సీనియర్ సలహా కోరతారు. అమెరికాలో వర్జిన్ అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరని.. ఒక వింత జంతువుని చూసినట్లు చూస్తారని చెప్తాడు. అందుకే యూఎస్ కి వర్జినిటీ కోల్పోయి రమ్మని సలహా ఇస్తాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులు వర్జినిటీ కోల్పోవడానికి ఏమేం చేశారు? ఈ క్రమంలో వాళ్ళ జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అమెరికా వెళ్ళారా లేదా? అనేది మిగిలిన కథ.

సినిమా ప్రారంభం నుంచే టీనేజ్‌ యువతలోని కోరికలు.. వారి ఆలోచనలు చూపించే ప్రయత్నం చేశారు రవిబాబు. శృంగారం అనే టాపిక్ తీసుకొని కథను అల్లినట్లు అనిపిస్తుంది. టీనేజ్‌ సెక్స్ - సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పే క్రమంలో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్ - అడల్ట్ సన్నివేశాలు చూపించారు. కండోమ్ వాడకం.. యాంగిల్స్ గురించీ దర్శకుడు చర్చించడంతో ఇదొక బూతు సినిమా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఓటీటీ కంటెంట్ కు సెన్సార్ నిబంధనలు కూడా లేకపోవడంతో దర్శకుడు స్వేచ్ఛగా పూర్తి స్థాయి అడల్ట్ కామెడీ సినిమా తీశారని అంటున్నారు. ఈ క్రమంలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సాయి సుధ పాత్ర గురించి ఎక్కవగా చర్చించుకుంటున్నారు. డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కాబట్టి అడల్ట్ కామెడీని ఇష్టపడే 18 - 35 ఏజ్ గ్రూప్ వారు రవిబాబు తీసిన అడల్ట్ ''క్రష్'' ని చూడొచ్చని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.