Begin typing your search above and press return to search.

పవన్ బర్త్ డే.. పాడుపని చేసిన యాంటి ఫ్యాన్స్!

By:  Tupaki Desk   |   3 Sept 2019 12:55 PM IST
పవన్ బర్త్ డే.. పాడుపని చేసిన యాంటి ఫ్యాన్స్!
X
సోషల్ మీడియా ఖాతాలకు డిస్ప్లే పిక్ (DP) ఉంటుంది కదా.. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సెలెబ్రిటీల పుట్టిన రోజు సమయంలో అది కామన్ డీపీగా మారుతుంది. మారుతుంది అంటే ఆటోమేటిక్ గా కాదు.. స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ ఒకేరకమైన కామన్ డీపీని పెట్టుకుని తమ ప్రియతమ స్టార్ హీరోపై అభిమానాన్ని చాటుకుంటారు. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అలాగే జరిగింది. కామన్ డీపీని ముందుగానే విడుదల చేయడం.. పవన్ ఫ్యాన్స్ అందరూ శ్రద్ధగా దాన్ని తమ డీపీగా పెట్టుకోవడం అందరినీ ఆకర్షించింది.

కామన్ డీపీతో పాటుగా ఒక కోటి ట్వీట్లతో పవన్ కు బర్త్ డే విషెస్ అందించాలని అభిమానులు సంకల్పించారు. #HappyBirthdayPawanKalyan హ్యాష్ టాగ్ కింద తమ బర్త్ డే విషెస్ తెలపాలని అనుకున్నారు. సాధారణ అభిమానుల నుండి సెలబ్రిటీల వరకూ ఇలా పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొందరు యాంటి-ఫ్యాన్స్ ఇదే సమయంలో #HappyBirthdayPawalaKalyan అంటూ ఒక హ్యాష్ టాగ్ ను ట్రెండింగ్ చేశారు. సడెన్ గా చూస్తే ఒకే రకంగా కనిపిస్తుంది కానీ ఇది పవన్ ను అవమానిస్తూ కావాలని ఫ్యాన్స్ రెచ్చగొట్టేందుకు చేసే ప్రయత్నమే.

అయితే సదరు యాంటి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్న హ్యాష్ టాగ్ ను సరిగా గమనించక కొందరు దాన్ని టాగ్ చేస్తూ పవన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అలా యాంటి ఫ్యాన్స్ బుట్టలో పడిన వారిలో 'పులి' హీరోయిన్ నికిషా కూడా ఉంది. కన్ఫ్యూజ్ అయిన నికిషకు తీరా బర్త్ డే విషెస్ చెప్పిన తర్వాత ఏం జరిగిందో అర్థం అయింది. అయితే జరిగిన పొరపాటును గుర్తించిన తర్వాత సరిదిద్దుకుని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్న హ్యాష్ టాగ్ కింద శుభాకాంక్షలు తెలిపింది. ఒకవైపు సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ సందడి జోరుగా ఉన్నప్పటికీ యాంటి ఫ్యాన్స్ తమకు వీలైనంతగా దాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు.