Begin typing your search above and press return to search.

అనుపమ.. ఇంత హాట్ పోజా!!

By:  Tupaki Desk   |   30 Dec 2016 7:30 AM GMT
అనుపమ.. ఇంత హాట్ పోజా!!
X
మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు అచ్చ తెలుగు ఆడపిల్లలా తయారైపోతోంది. వరుసగా పల్లెటూరి పిల్ల కేరక్టర్స్ రావడం.. ఇప్పుడు శర్వానంద్ తో చేస్తున్న శతమానం భవతిలో కూడా అదే టైపు కేరక్టర్ కావడంతో.. అమ్మడి మొహంలో తెలుగుదనం ఉట్టిపడుతోంది.

శతమానం ప్రమోషన్స్ లో భాగంగా అటు సాంప్రదాయ దుస్తులతో పాటు.. ఇటు మోడ్రన్ వేర్ లో కూడా అనుపమా పరమేశ్వరన్ స్టిల్స్ బాగానే బయటకు వస్తున్నాయ్ కానీ.. తాజాగా ఓ ఫోటోలో హాట్ లుక్స్ తో అనుపమ మత్తెక్కించేసింది. స్లీవ్ లెస్ వైట్ టాప్ వేసుకుని.. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కనిపించిన అనుపమ.. అందాలు ఆరేయడం లాంటివి చేయడం లేదు.. కళ్లతోనే మత్తెక్కించేస్తోంది. తలపై వెంట్రుకలు కాసిన్ని అలా పెదాలపై కదలాడుతుంటే.. మెడలో ఉన్న చైన్ ను చేతిలో పట్టుకుని. గడ్డం కింద చెయ్యి పెట్టుకుని.. అమ్మడు ఇచ్చిన చూపుతో ఫ్యాన్స్ అంతా ఫ్లాట్ అయిపోతున్నారు.

అనుపమా పరమేశ్వరన్ నటించిన శతమానం భవతి మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుండగా.. ఇంకా అనేక ప్రాజెక్టుల కోసం ఆమెతో సంప్రదిస్తున్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/