Begin typing your search above and press return to search.

వయ్యారి హంసనడకదానా.. నీ నడకలో హొయలున్నదే సానా

By:  Tupaki Desk   |   21 Dec 2020 11:32 AM IST
వయ్యారి హంసనడకదానా.. నీ నడకలో హొయలున్నదే సానా
X
నిలువవే వాలు కనులదానా..వయ్యారి హంసనడకదానా..
నీ నడకలో హొయలున్నదే తానా
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు..
ఓ లలనా..అది నీకే తెలుసు..

నిలువవే వాలు కనులదానా..వయ్యారి హంసనడకదానా..
నీ నడకలో హొయలున్నదే తానా

ఎవరని ఎంచుకొనినావో..పరుడని భ్రాంతిపడినావో..
ఎవరని ఎంచుకొనినావో..పరుడని భ్రాంతిపడినావో..సుగ్గుపడి తొలగేవో
విరహగ్నిలో నను తోసి పోయేవో

నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు..
ఓ లలనా..అది నీకే తెలుసు..

అక్కినేని నాగేశ్వర రావు - జమున జంట‌గా నటించిన క్లాసిక్ మూవీ `ఇల్ల‌రికం` లోనిది ఈ పాట‌. ఈ టీజింగ్ సాంగ్ కి కొస‌రాజు లిరిక్ అందించ‌గా.. ఘంట‌సాల ఆల‌పించ‌గా టి.చ‌ల‌ప‌తిరావు సంగీతం అందించారు. ఈ పాట‌ను ఇప్పుడే ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వ‌చ్చిందో వేరే చెప్పాలా. అదిగో ఆ దృశ్యంలో హంస న‌డ‌క‌ల హంసానందిని యాక్టివిటీ అలా ఉంది మ‌రి. బికినీలో హంస‌లా హొయ‌లు పోతూ కుర్ర‌కారును టెంప్ట్ చేస్తుంటే క్లాసిక్ సాంగ్ గుర్తు రాకుండా ఉంటుందా?