Begin typing your search above and press return to search.
సర్వం 7 టీషర్టుల మయం.. !
By: Tupaki Desk | 15 May 2019 10:32 AM ISTఅడ్వర్టైజ్మెంట్లు.. ప్రమోషన్లు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. అప్పట్లో 'నిర్మా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా' అనగానే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఓ అని ఊగిపోయేవారు. 'హమారా బజాజ్' అనే యాడ్ రాగానే ఎమోషన్ అయ్యేవారు. ఇప్పుడు కూడా కొన్ని యాడ్స్ కు ప్రేక్షకులు స్పందిస్తారు కానీ.. మెజారిటీ జనాలు మాత్రం యాడ్ రాగానే టీవీ ఛానల్ మార్చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలలో అయితే మూడు నాలుగు సెకన్లు కాగానే మరో క్షణం ఆలస్యం చేయకుండా 'స్కిప్ యాడ్' ను నొక్కేస్తారు.
అయినా మన పిచ్చిగానీ ఇది యాడ్ కంపెనీలకు తెలీదా? మన జనాల్లో సగం మంది సోషల్ మీడియాలో భామలను ఫాలో ఫాలో అంటుంటారని కార్పోరేట్ కంపెనీల వారికి కూడా తెలుసు. అందుకే మొబైల్ బ్రాండ్ వన్ ప్లస్ వారు తమ తాజా మోడల్ వన్ ప్లస్ 7 ను ఆవిష్కరణకు ముందుగా కాస్త హైప్ తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో సెగలు రేపే భామలను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. అందరూ జీరో సైజ్ బ్యూటీలే. వారందరికీ వన్ ప్లస్ 7 లోగో ఉన్న వైట్ కలర్ టీ షర్టులు ఇచ్చారు. ఇక చూడాలి.. ఒకరిని మించి ఒకరు ఆ టీ షర్టులను ధరించి వగలుపోతూ ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలను తమ ఇన్స్టా ఖాతాల ద్వారా షేర్ చేశారు.
ఆ భామల లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్.. ఊర్వశి రౌతేలా.. మౌని రాయ్.. నియా శర్మ.. కృతి కర్బందా..నితి టేలర్ లాంటివారు ఉన్నారు. వారితో పాటుగా సాక్షి మాలిక్.. కరణ్ దీపప్ కౌర్ లాంటి సోషల్ మీడియా సెన్సేషన్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అయితే 'ఫోను ప్రమోషన్ కాబట్టి' దిశా పతాని లాగా అంతః సౌందర్యం పెద్దగా చూపలేకపోయారు. ఏదైతేనేం... ఈ భామల దెబ్బకు వన్ ప్లస్ 7 ఫోన్ కు భారీ పబ్లిసిటీ వచ్చింది. నెటిజనులు హాట్ ఫోటోల కోసం ఇన్స్టా కు వెళ్తే ఎక్కడ చూసినా వన్ ప్లస్ 7 టీ షర్టులే. పాపం నెటిజనులు ఈ రోజుకు ఇలా సర్దుకోవాల్సి వచ్చింది!