Begin typing your search above and press return to search.

వంద ఎకరాల భూమి కొన్న హాట్‌ యాంకర్‌

By:  Tupaki Desk   |   20 Feb 2020 11:11 AM IST
వంద ఎకరాల భూమి కొన్న హాట్‌ యాంకర్‌
X
ఒకప్పుడు స్టార్స్‌ సంపాదించే వారు కాని దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో ఆలోచించే వారు కాదు. అప్పట్లో కొద్ది మంది వచ్చిన డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు కోట్లు లాభాలు పొందుతున్నారు. అందుకే ఇప్పటి వారు అంతా కూడా వచ్చిన మొత్తంలో కనీసం కొద్ది మొత్తం అయినా ఏదో ఒక వ్యాపారం లో పెట్టుబడిగా పెట్టడం చేస్తున్నారు. చాలా మంది భూములపై ఆసక్తి కనబర్చుతూ కొనుగోలు చేస్తున్నారు.

వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకు సెలబ్రెటీలు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. తక్కువ రేటుకు రావడంతో పాటు.. ప్రాపర్టీ ఉన్నట్లుగా ఉంటుందని కొనుగోలు చేస్తున్నారు. తాజాగా హాట్‌ యాంకర్‌ రష్మి కూడా ఏకంగా వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసిందట. అస్సాం ఆంధ్రా సరిహద్దుల్లో ఈమె స్వస్థలంలో వ్యవసాయం చేసేందుకు గాను వంద ఎకరాలను దాదాపుగా 5 కోట్ల రూపాయలు వ్యచ్చించి కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

అక్కడ కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల్లో కోకా ఇంకా యూకలిప్టస్‌ చెట్ల పెంపకం.. పండ్ల తోటల పెంపకం చేపట్టాలని రష్మి నిర్ణయించుకుందట. త్వరలోనే ఆ పనులు మొదలు పెట్టబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. జబర్దస్త్‌ తో పాటు పలు షో ల్లో కనిపిస్తూ హీరోయిన్‌ గా కూడా నటిస్తున్న ఈ అమ్మడు పలు విధాలుగా సంపాదిస్తుంది. కనుక వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసింది అంటే ఆశ్చర్యం ఏమీ లేదులేండి.