Begin typing your search above and press return to search.

పవన్‌ త్రివిక్రమ్‌ కాంబోపై ఫ్యాన్స్‌ కు మళ్లీ ఆశలు

By:  Tupaki Desk   |   27 July 2020 1:20 PM IST
పవన్‌ త్రివిక్రమ్‌ కాంబోపై ఫ్యాన్స్‌ కు మళ్లీ ఆశలు
X
పవన్‌ కళ్యాణ్‌ కు ఇండస్ట్రీలో మంచి మిత్రుడు త్రివిక్రమ్‌. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు కూడా హిట్‌ అవ్వడంతో వీరి కాంబోకు చాలా మంది ఫ్యాన్స్‌ అయ్యారు. చివరగా వీరు అజ్ఞాతవాసి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చడంతో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం పడినదే కామెంట్స్‌ వినిపించాయి. త్రివిక్రమ్‌ మాటలు వినడం వల్ల పవన్‌ నష్టపోయాడంటూ కొందరు ప్రచారం చేశారు. అదే సమయంలో పవన్‌ కు త్రివిక్రమ్‌ కు మద్య గ్యాప్‌ ఏర్పడినదే పుకార్లు షికార్లు చేశాయి.

వీరిద్దరి కాంబోలో సినిమాను కోరుకుంటున్న ఫ్యాన్స్‌ కు ఆ పుకార్లతో ఆశ చచ్చిపోయింది. మళ్లీ వీరు కలిసి సినిమా చేయకపోవచ్చు అనుకున్నారు. మంచి మిత్రులైన వీరిద్దరు సినిమాలు చేయకున్నా కనీసం కలిసి పోయి స్నేహితులుగా ఉన్నా బాగుండేది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో నితిన్‌ పెళ్లి కొడుకు వేడుకకు పవన్‌ కళ్యాణ్‌ మరియు త్రివిక్రమ్‌ లు హాజరు అయ్యారు. వీరితో పాటు నిర్మాత చినబాబు కూడా ఉండటంతో మళ్లీ వీరి కలయికలో సినిమా వస్తుందా అనే చర్చ మొదలైంది.

త్రివిక్రమ్‌ మరియు పవన్‌ లు ఎప్పుడు విడిపోలేదని ఇద్దరి మద్య స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈమద్య కాలంలో కరోనా కారణంగా ఫామ్‌ హౌస్‌ కే పవన్‌ పరిమితం అవ్వడంతో త్రివిక్రమ్‌ అప్పుడప్పుడు వెళ్లి కలిసి వస్తున్నాడట. ప్రస్తుతానికి వీరిద్దరి కాంబోలో మాత్రం సినిమా కష్టం. ఎందుకంటే వకీల్‌ సాబ్‌ కాకుండా మరో రెండు సినిమాలకు కూడా పవన్‌ ఇప్పటికే కమిట్‌ అయ్యి ఉన్నాడు. ఆ రెండు సినిమాలు కూడా పూర్తి అవ్వాలంటే టైం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. కాని వీరిద్దరి కాంబోలో అస్సలు సినిమా ఉండదు అని మాత్రం చెప్పడానికి లేదు. కనుక ఫ్యాన్స్‌ వీరి కాంబో మూవీపై మళ్లీ ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.