Begin typing your search above and press return to search.

నిజాయితీనే గిఫ్ట్ అంటున్న విదేశీ సోయగం..!!

By:  Tupaki Desk   |   9 Jan 2021 11:00 PM IST
నిజాయితీనే గిఫ్ట్ అంటున్న విదేశీ సోయగం..!!
X
సినీ ఇండస్ట్రీలో విదేశీ భామల హవా మాములుగా లేదు. ఏ సినిమాలో చూసినా ఈ మధ్య తెల్లతోలు వయ్యారాలు విరివిగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు విదేశీ గుమ్మలు లేకుండా ప్రత్యేక పాటలు ఫుల్ ఫిల్ అవ్వడం లేదనే చెప్పాలి. స్వీడిష్ సుందరి ఎల్లీ అవ్రామ్ గుర్తుండే ఉంటుంది. ఎన్నో బాలీవుడ్ సినిమాలలో మెరిసిన ఈ భామ.. టాలీవుడ్ ఇండస్ట్రీకి 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమాలోని :ఇరగ ఇరగ' సాంగ్ తో పరిచయం అయింది. స్వీడన్ దేశంలో పుట్టి పెరిగిన ఎల్లీ.. గత కొన్నేళ్లుగా ముంబైలో సెటిల్ అయింది. యవ్వనంలోనే మోడలింగ్ లో రాణించిన ఈ భామ స్వీడన్ దేశానికి చెందిన టీవీ షోలలో, అలాగే మిస్ గ్రీస్ బ్యూటీ కాంటెస్ట్ లలో కూడా పాల్గొంది.

మొత్తానికి 2013లో మిక్కీ వైరస్ అనే సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుసగా బాలీవుడ్ సినిమాలలో క్యారెక్టర్స్ పోషిస్తూ.. ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడింది. కానీ ఎల్లీ అందాల ఆరబోత మాత్రం మాములుగా ఉండదు. ఎంతటి మగవాడైనా ఇలా దాసోహం అయిపోయేలా తన సోయగాల వలలు విసురుతోంది. ఇంస్టాగ్రామ్ లో ఎల్లీకి 4 మిలియన్ల ఫాలోయర్స్ కలిగి ఉంది. బికినీ నుండి సారీ వరకు ఏదైనా మొహమాటం లేకుండా కట్టేస్తుంది ఎల్లీ. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా బ్లాక్ అండ్ వైట్ లుక్కులో ఫోటోస్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు టాప్ మాత్రమే ధరించి తన ఎద పరువాలను కెమెరా ముందు పెట్టింది. అంతే ఊరుకుంటారా కుర్రాళ్ళు.. అలా సెగలు రేపుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నాకొకరు చెప్పారు మనం లైఫ్ లో ఎవరికైనా ఇవ్వగలిగేది నిజాయితీ మాత్రమే.. అంటూ నోట్ రాసి పెట్టింది. ప్రస్తుతం ఎల్లీ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.