Begin typing your search above and press return to search.

మహేష్ కోసం హాలీవుడ్ నుంచి..

By:  Tupaki Desk   |   9 Nov 2017 9:30 AM GMT
మహేష్ కోసం హాలీవుడ్ నుంచి..
X
మహేష్ బాబు క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ అయినా.. ఇండియా వైడ్ గా మహేష్ కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ భామలు అందరూ తాము సౌత్ లో అయితే మహేష్ తో మూవీ చేయాలని కోరుకుంటున్నట్లు చెబుతుంటారు.

ఇటు సినిమల్లోనే కాదు.. అటు కమర్షియల్ ఎండార్స్ మెంట్స్ విషయంలో కూడా మహేష్ క్రేజ్ సూపర్బ్ గా ఉంటుంది. పలు బ్రాండ్స్ కు నేషనల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడంటే.. మహేష్ కి ఉన్న డిమాండ్ అర్ధమవుతుంది. సాఫ్ట్ డ్రింక్స్ కేటగిరీలో థమ్స్అప్ కు కూడా మహేష్ ప్రచారం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి మహేష్ తోనే యాడ్స్ చేస్తున్న ఈ సంస్థ.. ఫ్యూచర్ లో కూడా ఈ స్టార్ తోనే కంటిన్యూ అవుతామని పలుమార్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు మహేష్ తో కొత్త యాడ్ ను చిత్రీకరించేందుకు కంపెనీ సిద్ధమవుతుండగా.. ఈ యాడ్ షూటింగ్ కోసం ఇప్పటికే మహేష్ బాబు హాలీవుడ్ పయనం అయ్యాడు కూడా. ఇప్పటివరకూ వచ్చిన అన్ని యాడ్స్ లోకి ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది.

దాదాపుగా అందరూ హాలీవుడ్ టెక్నీషియన్స్ తోనే ఈ యాడ్ ను డిజైన్ చేయించారట. మన సూపర్ స్టార్ చేసే స్టంట్స్ కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉంటాయని.. అసలు ఊపిరి సలపనివ్వని స్థాయిలో ఈ ప్రకటన డిజైన్ చేశారని తెలుస్తోంది. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కలిగించేలా ఈ యాడ్ ను షూట్ చేయనున్నారట.