Begin typing your search above and press return to search.

'స‌లార్' కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్

By:  Tupaki Desk   |   21 Nov 2022 4:02 AM GMT
స‌లార్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్
X
పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ కథానాయ‌కుడిగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్త‌న్న‌ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సలార్'. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ఫుల్ స్వింగ్ లో ఉంది. షూటింగ్ ప్రధాన భాగం హైదరాబాద్ స‌హా ప‌లు అరుదైన లొకేష‌న్ల‌లో తెర‌కెక్కుతోంది. ఇక ఈ చిత్రం యాక్షన్ మునుపెన్న‌డూ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో లేనంత కొత్త‌గా ఉంటుంద‌న్న చ‌ర్చా సాగుతోంది. ప్రశాంత్ నీల్ సలార్ క్లైమాక్స్ ఫైట్ తో పాటు సినిమాలో ఆరు భారీ యాక్షన్ ఎపిసోడ్ లను ప్లాన్ చేశార‌ని క‌థ‌నాలొచ్చాయి. KGF మొత్తం సిబ్బంది సలార్ కోసం 24/7 ప‌ని చేయ‌డం చూస్తుంటే దీనికోసం టీమ్ ఎంత‌గా శ్ర‌మించిందో అర్థం చేసుకోవాలి.

KGF రెండు భాగాలకు పనిచేసిన స్టంట్ మాస్టర్స్ ఇప్ప‌టికే కొన్ని యాక్షన్ ఎపిసోడ్ లను రూపొందించారు. గోదావరిఖనిలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్ ను కూడా తెర‌కెక్కించారు. తాజా స‌మాచారం మేర‌కు ఇప్పుడు ప‌తాక‌స‌న్నివేశంలో భారీ యాక్ష‌న్ దృశ్యాల కోసం పాపుల‌ర్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ ని బ‌రిలో దించేస్తున్నార‌ని తెలిసింది. అత‌డి చేరిక‌తో స‌లార్ యాక్ష‌న్ మ‌రో లెవ‌ల్ ని ట‌చ్ చేస్తుంద‌ని సినిమాకి ఈ దృశ్యాలు మ‌రో హైలైట్ గా నిలుస్తాయ‌ని చ‌ర్చ సాగుతోంది.

అలాగే శ్రుతిహాస‌న్ పాత్ర ఇందులో ఎంతో ట్రాజిక్ గా ఎంతో ఎమోషన్ ని రగిలిస్తుంద‌ని కూడా చెబుతున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ అత్యంత భారీ బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తోంది. 2023 చివ‌రిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో టీమ్ రౌండ్ ది క్లాక్ ప‌ని చేస్తోంది.

అన్ని రికార్డులను బ్రేక్ చేయ‌డం ఖాయం:ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న‌ పాన్ ఇండియా చిత్రం 'స‌లార్' విడుదల కోసం మాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రభాస్ మాస్ కటౌట్ ని ఒక రేంజులో ఉపయోగించుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవ‌లే పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో స‌లార్ గురించి ఒక పోస్ట్ ను షేర్ చేసింది. అది క్ష‌ణాల్లోనే వైరల్ అయ్యింది. సాలార్ సెట్స్ లో ప్రశాంత్ నీల్ ను చూసే అవకాశం తనకు లభించిందని ఆమె రాసింది.

ప్ర‌శాంత్ త‌న‌కు తానే పోటీదారు. సలార్ అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని ఆమె బ‌లంగా చెబుతోంది. సెట్స్ లో తాను చూసిన దానిని బ‌ట్టి ఈ మూవీ తెర‌కెక్కుతున్న తీరును హైలైట్ చేస్తూ సుప్రియ చెప్పిన ఈ మాటలు ప్రభాస్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ చిత్రం 28 సెప్టెంబర్ 2023న విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.