Begin typing your search above and press return to search.

హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా బికినీ ట్రీట్‌

By:  Tupaki Desk   |   7 Oct 2021 5:31 AM GMT
హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా బికినీ ట్రీట్‌
X
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. అక్క‌డి స్టార్ ని పెళ్లాడి స్టార్ డ‌మ్ తో పాటు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అడ‌పాద‌డ‌పా బాలీవుడ్ చిత్రాల్లోనూ మెరుస్తున్న ప్రియాంక ఏ చిన్న గ్యాప్ దొరికినా త‌న హాట్ హాట్ ఫొటోల‌తో ఇన్ స్టాని హీటెక్కించేస్తోంది. తాజాగా ప్రియాంక అభిమానుల‌తో పంచుకున్న ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. హాట్ హాట్ అందాల‌తో బికినీ ట్రీట్ ఇవ్వ‌డంతో ఈ ఫొటోలు ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి.

వీకెండ్ హాలీడే సంద‌ర్భంగా త‌న స్నేహితుల‌తో క‌లిసి జాలీ ట్రిప్ కి వెళ్లింది ప్రియాంక‌. దానికి సంబంధించిన ఫొటోల‌ని ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. స్పెయిన్ లోని వాలెన్సియాకు హాలీడే ట్రిప్‌కి వెళ్లిన ప్రియాంక స్నేహితులు.. స‌న్నిహితుల‌తో క‌లిసి సంద‌డి చేసింది. రెడ్‌.. ఎల్లో క‌ల‌ర్ బికినీలు ధ‌రించి హోయ‌లు పోతూ అందాల విందు చేసింది. త‌న్వ‌య‌త్వంతో ఊగిపోతూ ఇదే త‌న‌కు స‌రైన సెల‌వు దినంగా ప్ర‌క‌టించికుని మురిసిపోయింది.

అంతే కాకుండా జెట్ స్కీ స్కూట‌ర్ పై విహ‌రిస్తూ త‌న ఆనందాన్ని ఆస్వాదించింది. స‌ముద్ర‌పు అల‌ల‌పై హంగామా చేస్తూ ప్రియాంక త‌న‌ని తాను మ‌రిచిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుని మురిసిపోయింది ప్రియాంక‌. వాట‌ర్ లో ఈత కొడుతున్న ఫొటోలు.. ఆ త‌రువాత స‌న్ రైజ్ ని త‌న ప్రియ‌మైన పెట్ తో క‌లిసి ఆస్వాధిస్తున్న దృశ్యాల‌ని కూడా ఈ సంద‌ర్భంగా ప్రియాంక అభిమానుల‌తో పంచుకుంది.