Begin typing your search above and press return to search.

RRR : మాట‌లు చాల‌వంటున్న హాలీవుడ్ ర‌చ‌యిత్రి!

By:  Tupaki Desk   |   16 Jun 2022 12:30 PM GMT
RRR : మాట‌లు చాల‌వంటున్న హాలీవుడ్ ర‌చ‌యిత్రి!
X
ఇద్ద‌రు స్టార్ ల‌ని క‌లిపి ఓ సినిమాతో అద్భుతాన్ని సృష్టించ‌వ‌చ్చ‌ని, తెలుగు సినిమా స్వ‌రూపాన్నే స‌మూలంగా మార్చ‌వ‌చ్చ‌ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి 'బాహుబ‌లి' సిరీస్ చిత్రాల‌తో యావ‌త్ ప్ర‌పంచానికి చాటిచెప్పారు. అదే ఫార్ములాని మ‌రింత‌గా ఎక్స్‌టెన్ష‌న్ చేసి ఇద్ద‌రు స్టార్ హీరోల కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌కెక్కించి వండ‌ర్స్ ని క్రియేట్ చేయ‌వ‌చ్చ‌ని 'RRR' తో నిరూపించి భార‌తీయ సినిమా అంటే హాలీవుడ్ మొత్తం తిరిగి చూసేలా చేశారు రాజ‌మౌళి.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల తొలి క‌ల‌యిక‌లో ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన మాగ్న‌మ్ ఓప‌స్ 'RRR'. చ‌రిత్ర‌లో నిలిచిపోయిన ఇద్ద‌రు రియ‌ల్ హీరోస్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల క‌థ‌కు ఫాంట‌సీ అంశాల‌ని జోడించి తెర‌కెక్కించిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు తిర‌గ‌రాసింది. ఊహ‌కంద‌ని సీన్ ల‌తో, యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో ఇద్ద‌రు స్టార్ ల‌ని ప‌రిచ‌యం చేసిన తీరు.. వారిని ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో కీల‌క ఘ‌ట్టాల్లో చూపించిన తీరు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1150 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. మార్చి 25న విడుద‌లైన ఈ మూవీ ఇప్ప‌టికీ వార్త‌ల్లో నిలుస్తూ చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

సినిమా విడుద‌లై నెల‌లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికి ఈ మూవీ ఫీవ‌ర్ పీక్స్ లోనే ట్రెండ్ అవుతోంది. థియేట్రిక‌ల్ ర‌న్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న త‌రువాత ఈ మూవీ ద‌క్షిణాది భాష‌ల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా.. హిందీ వెర్ష‌న్ మాత్రం ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ లో వ‌ర‌ల్డ్ వైడ్ గా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇతం వ‌ర‌కు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ ఇప్ప‌డు హాలీవుడ్ స్టార్స్ దృష్టిని ఆక‌ర్షిస్తూ చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ మూవీని నెట్ ప్లిక్స్ లో చూసిన ప‌లువురు హాలీవుడ్ రైట‌ర్స్ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఓ రైట‌ర్ ఏకంగా ఇక‌పై నువ్వు సినిమాలు చేయ‌కూదు బాసూ అంటూ రాజ‌మౌళిని ప్ర‌శంసించారు. '21 జంప్ స్ట్రీట్‌', 'ది లెగో', 'స్పైడ‌ర్ మ్యాన్ : ఇన్ టు ది స్పైడ‌ర్ వ‌ర్స్' వంటి చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిస్టోఫ‌ర్ మిల్ల‌ర్ సైతం 'RRR' ని పొగ‌డ‌కుండా వుండ‌లేక‌పోయారు. ఇలా ద‌ర్శ‌కులు, న‌టులు, ర‌చ‌యిత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తూనే వున్నారు.

తాజాగా ది ప‌సిఫిక్ రిమ్ 2, ది 100 వంటి హాలీవుడ్ చిత్రాల ర‌చ‌యిత కిరా స్నైడ‌ర్ 'RRR' పై స్పందించారు. ప్రీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ల‌పై చిరుత‌, పులి దాడికి య‌త్నించే షాట్స్ పై ఆమె ఆస‌క్తిక‌రంగా స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా 'RRR' పై కామెంట్ లు చేశారు. సినిమాలోపి ప్ర‌తీ సీన్ కూడా అమెజింగ్ గా వున్నాయి అని మాట‌లు జ‌స్టిఫై చేయ‌లేవు. మీ ఫ్రెండ్స్ తో క‌లిసి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి' అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కిరా స్నైడ‌ర్ ప్ర‌చారం చేస్తుండ‌టం విశేషం. ప్ర‌స్తుతం త‌ను పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.