Begin typing your search above and press return to search.

థియేట‌ర్ బిజినెస్ కి ఊపు తెచ్చే ఐడియా

By:  Tupaki Desk   |   3 Nov 2020 7:40 PM IST
థియేట‌ర్ బిజినెస్ కి ఊపు తెచ్చే ఐడియా
X
కోవిడ్ మ‌హ‌మ్మారీ అన్నిటికీ చెక్ పెట్టేసింది. ముఖ్యంగా సినీరంగానికి ఊహించ‌ని ముప్పులా మారింది. థియేట‌ర్లు తెర‌వ‌లేరు.. షూటింగుల‌కు వెళ్ల‌లేరు. అయితే ఇటీవ‌ల డేర్ చేసి షూటింగులు చేస్తున్నారు. అలాగే తెగించి థియేట‌ర్లు ఓపెన్ చేస్తామంటే జ‌నం రావ‌డ‌మే క‌ష్టంగా ఉంది. తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ థియేట‌ర్లు తెర‌వ‌డానికి ప్ర‌భుత్వ అనుమ‌తి లేక‌పోయినా ఏపీలో అనుమ‌తించారు.

అయితే అక్క‌డ స్ట్రెయిట్ సినిమా వేయ‌కుండా ఎంతో తెలివిగా కొరియ‌న్ మూవీని ఆడిస్తున్నార‌ట‌. ఇంత‌కీ అది ఏ మూవీ అంటే.. కొరియాలో విజ‌యం సాధించిన ‘బ్రేక్ ది సైలెన్స్’ విజయవాడలో విడుదలైంది. ఈ చిత్రం బెజ‌వాడ‌ ఊర్వసి ఐనాక్స్ లో రిలీజైతే స్పందన అద్భుతంగా ఉంద‌ట‌.

ఇది యూత్ ని ఉర్రూత‌లూగించిన‌ కొరియ‌న్ పాప్ బ్యాండ్ బీటీఎస్ క‌థాంశంతో తెరకెక్కిన చిత్ర‌‌మ‌ని జాజ్ బ్యాండ్ యూత్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన మూవీ అని చెబుతున్నారు. దీంతో ఇది యువ‌త‌రానికి బాగా క‌నెక్ట‌యిపోయింద‌ట‌. దీంతో ఇటీవ‌ల ఈ మూవీ ప్రదర్శనల సంఖ్య కూడా పెరిగిందట‌. విజ‌య‌వాడ‌లానే వైజాగ్ ‌లో కూడా ఇదే విధంగా ఈ మూవీ క్లిక్క‌య్యింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే త్వ‌ర‌లో సినిమాల్ని రిలీజ్ చేయాల‌నుకుంటున్న వారికి కొంత‌ర‌కూ ఊర‌ట ల‌భించిన‌ట్టే. ధైర్యంగా కంటెంట్ ఉన్న‌ త‌మ సినిమాల్ని థియేట్రిక‌ల్ రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేసే వీలుంటుంది. ద‌స‌రా వెళ్లిపోయినా క్రిస్మ‌స్ సంక్రాంతి హోప్ అయితే అలానే ఉంది. ఇక తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన పాత సినిమాల్ని ఈ క్రైసిస్ కాలంలో థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసే కంటే ఏదైనా హాలీవుడ్ కంటెంట్ తో ఫిల్ చేయ‌డ‌మే స‌రైన నిర్ణ‌యం అన్న వాద‌న కూడా వినిపిస్తోంది.

జ‌నాల భ‌యాల్ని దృష్టిలో ఉంచుకుంటే... భారీ క్రేజు ఉన్న సినిమా అయితే కానీ జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు ఆస్కారం లేదు. అందువ‌ల్ల ఏది ప‌డితే అది రిలీజ్ చేయ‌కుండా ఆచితూచి జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేయాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. ఇక హాలీవుడ్ స‌హా హాంకాంగ్ కొరియ‌న్ ఇండ‌స్ట్రీ స్ లో మ‌న జ‌నం చూడ‌ని ఎన్నో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ప్ర‌త్యేకించి ఫిలింఫెస్టివ‌ల్స్ లో అవార్డుల‌తో పాటు కామ‌న్ ఆడియెన్ మ‌న‌సు దోచిన‌వి ఉన్నాయి. అవి మ‌న యూత్ కి తెగ న‌చ్చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదు. ప్ర‌స్తుత క్రైసిస్ లో ఇలాంటి కంటెంట్ ని తెస్తేనే బావుంటుంద‌ని భావిస్తున్నారు.