Begin typing your search above and press return to search.
'ఇండియన్ మిస్టరీస్' సబ్జెక్టుతో హాలీవుడ్ డైరెక్టర్ సినిమా..?
By: Tupaki Desk | 22 Jun 2021 3:00 PM ISTఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా విదేశీ పోకడలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇదివరకు ఇండియన్ సినిమాలను విదేశీ భాషల్లో.. విదేశీ సినిమాలు ఇండియాలో రీమేక్ అవుతుండేవి. కానీ మాక్సిమం హాలీవుడ్ సినిమాలే ఎక్కువగా ఇండియాలో రీమేక్ చేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే హాలీవుడ్ సినిమాలు ఇండియాలో కూడా రిలీజ్ అవుతాయనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు హాలీవుడ్ నుండి ఇండియాలో విడుదలై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి.
అలాగే కొన్ని ఆస్కార్ సినిమాలు కూడా మన ఇండియన్ భాషల్లో డబ్ వెర్షన్ చూస్తుంటాం. అయితే ఇంతవరకు జేమ్స్ కామెరూన్.. స్టీవెన్ స్పీల్ బర్గ్.. క్రిస్టోఫర్ నోలన్.. మనోజ్ నైట్ శ్యామలన్ లాంటి దర్శకులు తక్కువగా తెలుసు. కానీ త్వరలోనే మరో హాలీవుడ్ డైరెక్టర్ ఇండియన్ మిస్టరీ స్టోరీస్ పై సినిమా తీయనున్నట్లు టాక్ నడుస్తుంది. కాంజూరింగ్.. సా.. ఆక్వామాన్.. కాంజూరింగ్ 2 లాంటి సినిమాలతో ఇండియన్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యాడు డైరెక్టర్ జేమ్స్ వాన్. ఈ ఆస్ట్రేలియన్ డైరెక్టర్ ప్రస్తుతం మాలిగ్నన్ట్ అనే హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత ఇండియన్ మిస్టరీస్ పై సినిమా ప్లాన్ చేసాడని ఇండస్ట్రీ వర్గాలలో రూమర్స్ వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ జేమ్స్ వాన్ మొదటినుండి కూడా హారర్ - థ్రిల్లర్ నేపథ్యం కలిగిన కథంశాలతో సినిమాలు రూపొందిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఇండియన్ మిస్టరీస్ నేపథ్యంలో సినిమా అంటే ఖచ్చితంగా చాలా ఇంటరెస్టింగ్ ఉండబోతుందని అంటున్నారు నేటిజన్లు. కానీ ఈ విషయం నిజామా కాదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఒకవేళ నిజమైతే మాత్రం పక్కా ఓ హారర్ థ్రిల్లర్ మూవీ రాబోతుందని అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కాబోతున్నాడని సమాచారం. అలాగే డైరెక్టర్ వాన్ కూడా ఇండియన్ సినిమాలను.. ఇక్కడి మేకింగ్ స్టైల్ బాగా ఇష్టపడే వ్యక్తి. సో మరి త్వరలోనే ఏదైనా కబురు అందిస్తాడేమో చూడాలి.