Begin typing your search above and press return to search.

వాల్మీకి కోసం వచ్చిన విశ్వ విజేత

By:  Tupaki Desk   |   6 Aug 2019 12:28 PM IST
వాల్మీకి కోసం వచ్చిన విశ్వ విజేత
X
ప్రపంచ సినిమా అత్యున్నత ప్రామాణికంగా పురస్కారంగా భావించే ఆస్కార్ అంటే మనవాళ్ళకు ఎంత గౌరవమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులోనూ పలుమార్లు అది గెల్చుకున్న విజేతను కలవాల్సి వస్తే అంత కన్నా ఎగ్జైట్ మెంట్ ఏముంటుంది. దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ అనుభూతిని ఆస్వాదిస్తున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న వాల్మీకి సెట్ కు సుప్రసిద్ధ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్ సన్ విచ్చేయడం యూనిట్ మొత్తానికి స్వీట్ షాక్ గా నిలిచింది.

అంతేకాదు అక్కడ జరుగుతున్న వాల్మీకి షూట్ ని తన చేతుల్లోకి తీసుకుని రాబర్ట్ కాసేపు కెమెరాతో బాధ్యతలు నిర్వర్తించగా ఉద్వేగాన్ని అణుచుకుని హరీష్ శంకర్ సూచనలు ఇస్తూ కట్ చెప్పడం అంతా చకచకా జరిగిపోయింది. ఈ జ్ఞాపకాలను తన చివరి రోజు దాకా గుర్తు పెట్టుకుని భద్రపరుచుకుంటానని సోషల్ మీడియా వీటి తాలుకు ఫోటోలను షేర్ చేసుకున్నాడు హరీష్

వచ్చే నెల 13న విడుదల కానున్న వాల్మీకి వరుణ్ తేజ్ కి డిఫరెంట్ మూవీగా నిలవబోతోంది. తమిళ్ బ్లాక్ బస్టర్ జిగర్ తండకు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరొయిన్ కాగా తమిళ హీరో అధర్వ ఇంకో కీలక పాత్ర చేస్తున్నాడు. వరుణ్ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉండటమే ఇందులో ప్రత్యేకత. రాబర్ట్ రిచర్డ్ సన్ ని రత్నవేలు సైతం ప్రత్యేకంగా కలిసి ఆయన నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం గమనార్హం. మొత్తానికి రిచర్డ్ రాబర్ట్ సన్ గడిపింది కాసేపే అయినా వాల్మీకితో పాటు తనను మీట్ అయిన అందరికి మర్చిపోలేని మెమరీని కానుకగా ఇచ్చేశారు.