Begin typing your search above and press return to search.

మన మీర్జాపూర్ స్టార్ కి హాలీవుడ్‌ ఛాన్స్

By:  Tupaki Desk   |   10 Nov 2022 6:31 AM GMT
మన మీర్జాపూర్ స్టార్ కి హాలీవుడ్‌ ఛాన్స్
X
ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులకు మీర్జాపూర్ వెబ్‌ సిరీస్ తో సుపరిచితుడు అయిన అలియా ఫజల్ మరో సారి హాలీవుడ్‌ లో ఆఫర్ ను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు బాలీవుడ్‌ లో పలు సినిమా ల్లో నటించడంతో పాటు సిరీస్‌ లతో మెప్పించిన అలియా ఫజల్ ఇప్పుడు హాలీవుడ్‌ లో ఆస్కార్‌ విన్నర్ తో కలిసి వర్క్ చేసేందుకు సైన్ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ మీడియా కథనాల అనుసారం అలియా ఫజల్‌ తాజాగా హాలీవుడ్ దర్శకుడు బిల్ గుట్టెంటాగ్ రూపొందిస్తున్న ఆఫ్ఘన్ డ్రీమర్స్ సినిమా లో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడు. అందుకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యి ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు అయినట్లుగా తెలుస్తోంది.

ఆస్కార్ అవార్డును దక్కించుకున్న బిల్ గుట్టెంటాగ్ వంటి గొప్ప దర్శకుడితో వర్క్ చేసే అవకాశం రావడంతో చాలా సంతోషంగా ఉంది అంటూ మీర్జాపూర్ నటుడు అలియా ఫజల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. త్వరలోనే తాను షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు.

ఆఫ్ఘన్ టెక్ వ్యవస్థాపకుడు అయిన రోయా మహబూబ్ గురించిన కథ తో ఈ సినిమా రూపొందుతుందనే వార్తలు వస్తున్నాయి. ఆయన గురించి మరియు ఆఫ్ఘన్‌ మహిళలు ఇంకా వారి యొక్క శాస్త్రీయ సాంకేతిక నైపుణ్యాల గురించి ఈ సినిమా లో చూపించబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. అద్భుతమైన స్క్రీన్‌ ప్లే మరియు దర్శకత్వం తో ఆఫ్ఘన్‌ డ్రీమర్స్ సినిమా ఉండబోతుందని అంతా నమ్ముతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.