Begin typing your search above and press return to search.

RRR హాలీవుడ్ హవా.. అస్సలు ఆగట్లేదుగా!

By:  Tupaki Desk   |   14 Jun 2022 11:30 AM GMT
RRR హాలీవుడ్ హవా.. అస్సలు ఆగట్లేదుగా!
X
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాపై కేవలం ఇండియన్ స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా హాలీవుడ్ నుంచి ప్రముఖ టెక్నీషియన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉండడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా హై రేంజ్ లో క్లిక్ అయ్యింది.

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా మంచి స్పందన అందుకోవడం విశేషం. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ అయితే అత్యధిక మంది వీక్షించిన ఇండియన్ సినిమాగా కూడా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా అమెరికా హాలీవుడ్ స్క్రీన్ రైటర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమా గొప్పతనం గురించి తెలియజేశాడు.


హిట్ యానిమేషన్ క్యారెక్టర్స్ మినియన్స్, సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ 1 రచయిత బ్రెయిన్ లించ్ వావ్ RRR సినిమాపై వావ్ అంటూ ట్వీట్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడయాలో వైరల్ గా మారింది.

ఇదివరకే చాలామంది హాలీవుడ్ సినీ ప్రముఖులు RRR సినిమా అద్బుతమైమ ఎమోషనల్ యాక్షన్ మూవీ అని తెలియజేయగా ఇప్పుడు మరో రైటర్ అద్బుతమని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

మంచి జాయ్ మూవీ అని కూడా పేర్కొన్నారు. మొత్తానికి RRR సినిమాకు హాలీవుడ్ ప్రముఖులు నుంచి మాత్రం ఇప్పుడప్పుడే ప్రశంసలు ఆగేలా లేవని చెప్పాలి. మరికొందరు స్టార్స్ కూడా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఇండియా మొత్తంలో బాక్సాఫీస్ వద్ద 12 వందల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.