Begin typing your search above and press return to search.

తెలుగు తెర‌పై.. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా!

By:  Tupaki Desk   |   29 March 2021 12:30 AM GMT
తెలుగు తెర‌పై.. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా!
X
మోడ‌ల్ గా కెరీర్ మొద‌లు పెట్టి, బాలీవుడ్ లో స‌త్తా చాటిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు హాలీవుడ్ లోనూ జెండా పాతారు. త‌న‌దైన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఆమె ఆటో బ‌యోగ్ర‌ఫీ పుస్త‌కం అమ్మ‌కాలే ఆ విష‌యాన్ని రుజువు చేస్తున్నాయి.

బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా వెలుగొందిన ప్రియాంక‌.. నిక్ జోన‌స్ ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత హాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్ హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే.. సుంద‌రి తెలుగులో కూడా ఓ సినిమా చేసింద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు.

ప్రియాంక తెలుగు సినిమా అంటే.. డ‌బ్బింగ్ మూవీ ‘క్రిష్’ గుర్తుకు రావొచ్చు. కానీ.. అది కాదు. స్ట్రయిట్ తెలుగు చిత్రంలోనే నటించిందీ బ్యూటీ. ఆ సినిమా పేరు ‘అపురూపం’. సాయిరవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్ర‌స‌న్న హీరోగా న‌టించారు. అయితే.. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

సోషల్ మీడియా విస్తృతం అయిన త‌ర్వాత ఎక్క‌డెక్కడి విష‌యాలో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. చిరంజీవి-శ‌ర్వానంద్ క‌లిసి న‌టించిన 17 ఏళ్ల‌నాటి థ‌మ్స్ అప్ యాడ్ ఇటీవ‌ల ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. ఆ విధంగా.. ఈ మూవీ పోస్ట‌ర్ ఏ త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డిందోగానీ.. ఇప్పుడిలా తెర‌పైకి వ‌చ్చింది.