Begin typing your search above and press return to search.

హాలీవుడ్ హీరోయిన్ మన లక్ష్మీదేవి భక్తురాలట?

By:  Tupaki Desk   |   9 Oct 2020 5:45 PM IST
హాలీవుడ్ హీరోయిన్ మన లక్ష్మీదేవి భక్తురాలట?
X
చాలా మంది విదేశీయులు మన హిందూ మతాన్ని.. హిందుత్వ భావజాలాన్ని ఇష్టపడుతారు. కొందరైతే హిందూ మతాన్ని కూడా స్వీకరిస్తారు. మన తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి విదేశీ భక్తులు వస్తుంటారు.

అలాంటి వాళ్లలో ప్రముఖులు కూడా ఉండడం విశేషం. ఎన్నో హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన సల్మా హయెక్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.

సల్మా మన హిందూ దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తుందట.. ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిపైనే దృష్టి పెడుతుందట.. ఈ విషయాన్ని సల్మా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. లక్ష్మీదేవి ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేయడం విశేషం.

‘నేను నా అంత: సౌదర్యంతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు దేవత లక్ష్మీదేవిపై దృష్టి పెట్టి ధ్యానం చేస్తాను. హిందూ మతస్థులు ఆమెను సంపదకు.. అదృష్టానికి, ప్రేమకు, అందానికి ప్రతినిధిగా భావిస్తారు. ఆమె చిత్రం నాకు చాలా సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. అవే అంత: సౌందర్యానికి బాటలు వేస్తాయి’ అని సల్మా పేర్కొంది.

ఒక హాలీవుడ్ హీరోయిన్ ఇలా హిందూ దేవతను పొగడడంపై బాలీవుడ్ హీరోయిన్ బిపాసా అద్భుతం అంటూ కామెంట్ చేసింది.