Begin typing your search above and press return to search.

కొవిడ్ -19 సోకి స్టార్ హీరోయిన్ ఐసోలేష‌న్?

By:  Tupaki Desk   |   18 March 2020 9:00 AM GMT
కొవిడ్ -19 సోకి స్టార్ హీరోయిన్ ఐసోలేష‌న్?
X
క‌రోనా ఇంటా బ‌య‌టా బెంబేలెత్తిస్తోంది. ఈ మ‌హమ్మారీ క‌ట్ట‌డి కోసం సెల‌బ్రిటీలంతా ఒక్కొక్క‌రుగా త‌మ‌వంతుగా స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి వీడియోల‌తో ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రోవైపు స్వాములు య‌జ్ఞాలు యాగాలు అంటూ హ‌డావుడి చేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇక పోతే క‌రోనా భారిన ప‌డి ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 6వేల మంది చ‌నిపోగా.. భార‌త దేశంలో ప‌లు మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. తెలుగు రాష్ట్రంలో ఒక క‌రోనా మ‌రణం న‌మోద‌వ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. తెలంగాణ‌లో ఐదుగురు.. ఆంధ్రాలో ఒక‌రు క‌రోనా పాజిటివ్ అని తేలడంతో అంతా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మ‌రోవైపు సెల‌బ్రిటీల్ని క‌రోనా వ‌దిలిపెట్ట‌డం లేదు.

ఇప్ప‌టికే ప‌లువురు హాలీవుడ్ స్టార్ల‌కు క‌రోనా సోకింది. ఇప్ప‌టికే ఐసోలేష‌న్ వార్డుల్లో చికిత్స పొందేందుకు ప్రిప‌రేష‌న్ లో ఉన్నారు. విదేశాలు వెళ్లొచ్చిన రాజ‌కీయ నాయ‌కులు స‌హా ప‌లువురు బిక్కు బిక్కుమంటూ బ‌తుకు వెళ్ల‌దీయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌పోతే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌ముఖ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాచెల్ మాథ్యూ క‌రోనా భారిన ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని రాచెల్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు హాలీవుడ్ స్టార్ల‌కు కోవిడ్ 19 సోక‌డం సంచ‌ల‌న‌మైంది.

రాచెల్ మాథ్యూస్ .. ఫ్రోజెన్ 2కి వాయిస్ ఇచ్చిన న‌టిగా సుప‌రిచితం. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లోనూ న‌టించారు. ఇప్ప‌టికే క‌రోనా భారిన ప‌డిన ఈ న‌టి ఐసోలేష‌న్ (ఏకాంత‌) వార్డులో చికిత్స పొందుతోంది. కొవిడ్ 19 వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టి నుంచి త‌ను రోజు రోజుకు ఎలా చికిత్స తీసుకుంటుందో వివ‌రిస్తూ ప‌లు పోస్టులు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని.. డాక్ట‌ర్లు చెప్పే వరకు నిర్బంధంలోనే ఉండాల్సి ఉంటుందని రాచెల్ చెప్పింది. టామ్ హాంక్స్ .. ఆయ‌న‌ భార్య సైతం ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ రిపోర్టుతో చికిత్స‌ను పొందుతున్నారు.

రాచెల్ మాథ్యూస్ కి వైరస్ ఎలా సోకింది? అంటే.. అప్ప‌టికే క‌రోనా భారిన ప‌డిన‌ ఒక వ్యక్తి త‌న ప‌రిస‌రాల్లో ఉండ‌డ‌మే కార‌ణం అని తెలిసింది. వెంట‌నే సందేహం వ‌చ్చి కోవిడ్ -19 నిర్ధారణ‌ పరీక్షలు చేయవలసి వచ్చింది. ఇక మందు క‌నిపెట్ట‌ని ఈ వైర‌స్ ని ఆపాలంటే చాలా జాగ్ర‌త్తలు తీసుకోవాల్సి ఉంటుంద‌ని టిప్స్ ని రాచెల్ త‌న సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది.