Begin typing your search above and press return to search.

తల్లి పాలనూ ట్రోల్‌ చేస్తారా.. హీరోయిన్ ఆవేదన

By:  Tupaki Desk   |   20 Aug 2021 8:08 AM IST
తల్లి పాలనూ ట్రోల్‌ చేస్తారా.. హీరోయిన్ ఆవేదన
X
హాలీవుడ్ నటి గాల్‌ గాడోట్ ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసిన ఈ ఫొటోలు వివాదాస్పదం అయ్యాయి. షూటింగ్‌ కు రెడీ అవుతున్న గాడోట్ తన బిడ్డ కోసం చనుబాలను డబ్బలో ఫిల్‌ చేయడం కోసం పంపింగ్‌ చేస్తూ ఉంది. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. చనుపాలు పంపింగ్ ఫొటోలను షేర్‌ చేసి చీప్‌ పబ్లిసిటీ కోరుకుంటుంది అంటూ కొందరు ఆమెను తీవ్రంగా విమర్శించారు. షూటింగ్‌ సమయంలో బిడ్డకు పాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కనుక పాలను ముందుగానే తీసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎవరు తప్పు అనడం లేదు కాని పాలు పంపింగ్ ను ఫొటో ను తీసి షేర్‌ చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ విమర్శించారు.

తనపై వస్తున్న విమర్శలకు ఆమె స్పందించింది. ఒక తల్లిగా తన బిడ్డ గురించి ఆలోచించడంతో పాటు తన వృత్తిపరంగా న్యాయం చేసేందుకు నేను ఎప్పుడు ముందు ఉండాలి. అందుకే మేకప్ సమయంలో నా బిడ్డ కోసం పాలు పంపింగ్‌ చేశాను. అందులో తప్పేముంది అంటూ ప్రశ్నించింది. తల్లి పాలను కూడా ఇలా ట్రోల్‌ చేస్తారని ఊహించలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. నా బిడ్డకు ఇచ్చే పాలకు సంబంధించిన విషయంలో ఇలాంటి ట్రోల్‌ చేసే వారి విజ్ఞత ఎంత అనేది వారే అర్థం చేసుకోవాలంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తాను వివరించడం కోసం ఇలా చేశాను అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. తాను చేసిన పనిని విమర్శించిన వారు తల్లి పాల విలువ తెలియని వారు.. చేసే పని యొక్క గొప్పతనం తెలియని వారు అంటూ కౌంటర్ ఇచ్చింది. తల్లి అయ్యాక పనిలోకి వెళ్లడం ఎంతటి కష్టమో కొందరికి మాత్రమే తెలుసు. వారు ఇలాంటి వ్యాఖ్యలను చేయరు అంటూ గాడోట్ తనపై వస్తున్న విమర్శలకు చాలా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. ఈ విషయంలో గాడోట్‌ కు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.