Begin typing your search above and press return to search.
బన్నీ కెరీర్లో రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే...!
By: Tupaki Desk | 14 April 2020 11:40 AM ISTమనం తీసుకునే నిర్ణయాలు ఒక్కక్కసారి మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి.. కొన్ని నిర్ణయాలు అగాధంలోకి నెట్టేస్తాయి. ఆ నిర్ణయాల వల్ల మంచి జరిగినప్పుడు వాటి గురించి ఆలోచించ వలసిన పని లేదు - కాని చెడు జరిగినప్పుడు మాత్రం ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటె బాగుండేది అని ఫీల్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు మంచి అవకాశం వచ్చినప్పుడు పరిస్థితులను బట్టి వాటిని వదులుకుంటూ వస్తుంటాం. తర్వాత ఆ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకున్నానా అని బాధ పడుతుంటాం. ఇంక సినీ ఇండస్ట్రీ విషయానికొస్తే కథ నచ్చకో, డేట్స్ అడ్జస్ట్ కాకనో ఒక్కోసారి కొంత మంది హీరోలు తమ దగ్గరికి వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ సినిమాలు ఫ్లాప్ అయితే పరవాలేదు. కానీ హిట్ అయితే మాత్రం ఆ హీరోతో పాటు ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అలా బన్నీ కాదనుకున్న చాలా సినిమాలు తరువాత బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఆ లిస్ట్ చూస్తే అభిమానులే కాదు ఎవరైనా షాక్ అవుతారు.
అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు... ఇటీవల 'అల వైకుంఠపురములో' మూవీతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో తన సత్తాను మరోసారి ఇండస్ట్రీకి చూపించాడు. బన్నీ కెరీర్‌లో అందరి హీరోలకన్నా సక్సెస్ రేట్ ఎక్కువ. అయినప్పటికీ బన్నీ తన కెరీర్‌లో ఎన్ని హిట్ సినిమాలు వదులుకున్నాడో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నోరెళ్లబెడతారు. బన్నీ ఫస్ట్ సినిమా గంగోత్రి సమయంలో దర్శకుడు తేజ ఆయనకు 'జయం' స్టోరీ వినిపించాడు. కానీ గంగోత్రి రిలీజ్ సమయం కావడంతో జయం సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో నితిన్ ఆ ఛాన్స్ కొట్టేసి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో 'భద్ర' సినిమాను కూడా బన్నీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజకు వెళ్లడం సూపర్ హిట్‌గా నిలవడం జరిగిపోయాయి. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 100% లవ్ కూడా బన్నీ చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా అక్కినేని నాగ చైతన్యకు వెళ్లి ఆయన కెరీర్లో మైలురాయి చిత్రంగా మిగిలిపోయింది.
అంతేకాకుండా గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో 'పండగ చేస్కో' సినిమా కూడా ఫస్ట్ బన్నీ దగ్గరికే వచ్చింది. సంచలనం సృష్టించిన 'అర్జున్ రెడ్డి' చిత్ర కథ మొదట బన్నీ, ఆ తర్వాత శర్వానంద్ రిజెక్ట్ చేశారట. అలాంటి కథలకు తాను సూట్ కానని బన్నీ ఓ ఇంటర్వ్యూ లో కూడా తెలిపాడు. దర్శకుడు విక్రమ్ కుమార్ 'గ్యాంగ్ లీడర్', నాగచైతన్య 'ఒక లైలా కోసం', సునీల్ 'కృష్ణాష్టమి' సినిమాలు మొదట అల్లు అర్జున్ తో చేయాలని ప్రయత్నించారు. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'అరవింద సమేత' కథని త్రివిక్రమ్ మొదట బన్నీకి వినిపించినట్లు సమాచారం. దర్శకుడు పరుశురాం 'గీత గోవిందం', రవితేజ 'డిస్కోరాజా' సినిమాలను బన్నీ రిజెక్ట్ చేసాడు. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలవగా కొన్ని ప్లాప్ చిత్రాలుగా మిగిలిపోయాయి. కానీ ఆ చిత్రాలలో అల్లు అర్జున్ నటిస్తే ఎలా ఉండేదో తెలియదు కదా...!