Begin typing your search above and press return to search.

టూమ‌చ్ నానీ.. దిస్ ఈజ్ టూమ‌చ్!

By:  Tupaki Desk   |   3 March 2020 9:58 AM IST
టూమ‌చ్ నానీ.. దిస్ ఈజ్ టూమ‌చ్!
X
యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ హీరోగా నాని నిర్మించిన హిట్ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి డివైడ్ టాక్ తెచ్చుకుంది. `అ` త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ ఎంతో సెల‌క్టివ్ గా క‌థ‌ను ఎంచుకుని నిర్మించాడు. రిలీజ్ కు ముందు బోలెడంత హ‌డావుడి జ‌రిగింది. కానీ రిలీజ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు స‌హా విమ‌ర్శ‌కులు పెద‌వి విరిచేసారు. కానీ నాని అండ్ టీమ్ మాత్రం సినిమాను ప్ర‌చారార్భాటంతో పైకి లేపాల‌నే ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత పైర‌సీ పోటు అంతే చ‌ర్చ‌కు వ‌చ్చింది.

య‌థావిధిగానే అంద‌రిలానే.. స‌క్సెస్ అంటూ నానీ అండ్ టీమ్ విజ‌యోత్స‌వం జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా నాని సినిమా గురించి ..ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ గురించి ఓ రేంజ్ లో చెప్పుకొచ్చాడు. సినిమా రిలీజ్ రోజునే హిట్ అని ప్రేక్ష‌కులు తేల్చేసారుట‌. వ‌సూళ్ల ప‌రంగా సిస‌లైన స‌క్సెస్ సాధించింద‌ని మ‌రుస‌టి రోజు నుంచి అర్ధ‌మైంద‌న్నాడు. అయితే పైర‌సీ కార‌ణంగా చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని అన్నాడు. పైర‌సీ చూసే వాళ్లంతా థియేట‌ర్ కు వెళ్లి చూస్తే హిట్ చిన్న సినిమాల్లో బాహుబ‌లి అయ్యేది అంటూ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌నులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పించ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

`బాహుబ‌లి` లాంటి పాన్ ఇండియా సినిమా తో హిట్ లాంటి చిన్న సినిమాని పోల్చ‌డం ఎంత వ‌ర‌కూ క‌రెక్ట్ బాస్? అంటూ ప‌్ర‌శ్నిస్తున్నారు. చిన్న సినిమాలుగా రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. పెళ్లి చూపులు- గీతాగోవిందం ఈ కేట‌గిరీనే. ఆ సినిమాల‌కు వ‌చ్చిన టాక్ అయినా హిట్ కి ఉందా? అంటే పెద‌వి విరిచేసే ప‌రిస్థితి. క‌నీసం వాటితో అయినా పోల్చ‌కుండా బాహుబ‌లి సినిమాతోనే పోలిక ఏమిటో.. మ‌రీ టూమ‌చ్ గా ఉంది అంటూ నాని వ్యాఖ్య‌ల్ని ట్రోల్ చేస్తున్నారు. ఎంత సొంత నిర్మాణ సంస్థ‌లో సినిమా నిర్మిస్తే మాత్రం మ‌రీ ఇంత‌గా భ‌జ‌న చేయాలా? అంటూ మండి ప‌డుతున్నారు. హిట్ కోసం ఆప‌సోపాలు ప‌డ‌కుండా వీ కోసం విజ్ఞానం ప్ర‌ద‌ర్శిస్తే మంచిదేమోన‌ని స‌ల‌హా ఇస్తున్నారు నెటిజ‌నం.