Begin typing your search above and press return to search.
తారక్ తో యంగ్ డైరెక్టర్ జాక్ పాట్?
By: Tupaki Desk | 10 Dec 2020 9:59 AM ISTపాన్ ఇండియా డైరెక్టర్లకు మాత్రమే ఆఫర్లు ఇస్తున్న స్టార్ హీరోలు ఒక అప్ కం డైరెక్టర్ కి ఛాన్సివ్వడం అంటే అది మిరాకిలే. కానీ అప్పుడప్పుడు అది సాధ్యమవుతుంది. ప్రస్తుతం తారక్ ఇచ్చిన ఆఫర్ చూస్తుంటే ఇలాంటి సందేహమే వ్యక్తమవుతోంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేశాక త్రివిక్రమ్ తో సినిమా కోసం సీరియస్ గా థింక్ చేస్తున్న ఎన్టీఆర్ అటుపైనా కేజీఎఫ్ డైరెక్టర్ కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ల తో పని చేయాలని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఓ యంగ్ డైరెక్టర్ తన స్క్రిప్ట్ వినిపించి తారక్ కి ఒప్పించారన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్.
ఈ ఏడాది ఆరంభంలో ప్రశంసలు పొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ `హిట్`తో పరిశ్రమలో అడుగుపెట్టిన యువ దర్శకుడు సైలేష్ కోలను వినిపించిన స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నచ్చేసిందట. సైలేష్ ఇటీవల దిల్ రాజుకు స్క్రిప్ట్ వివరించాడు. అటుపై ఆయన ఎన్టీఆర్ వద్దకు తీసుకువెళ్ళారట. స్క్రిప్ట్ విన్న తరువాత ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయాలన్న ఉత్సాహం చూపించారట. అయితే దేనికైనా స్క్రిప్ట్ పూర్తి అయ్యి అధికారికంగా ప్రకటించాకే కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. శైలేష్ కి జాక్ పాట్ తగిలేనా? అన్నది వేచి చూడాలి.