Begin typing your search above and press return to search.
చిరు-మణిశర్మల మ్యూజిక్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుందా?
By: Tupaki Desk | 2 May 2020 3:15 PM ISTప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ 'ఆచార్య' సినిమా తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం 40 శాతం కంప్లీట్ అయిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. మరి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రేక్షకుల్లో చిరంజీవి చేసే మెస్మరైజింగ్ డ్యాన్సులు, యాక్షన్ కి క్రేజ్ అంతాఇంతా కాదు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తీస్తున్న ఆచార్య సినిమా ఆయనకు 152వ సినిమా. ఈసారి మెగాస్టార్ మార్కు డ్యాన్సులు, ఎంటర్టైన్మెంట్ మిస్సవ్వకూడదని ఫిక్సయ్యాడట చిరంజీవి. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మను దింపాడు.
మణిశర్మకు దాదాపు 12యేళ్ల తర్వాత మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. మెగాస్టార్-మణిశర్మ కాంబినేషన్లో మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి తెలుగు ప్రేక్షకులకు రుచి చూపాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు ఎలాగైనా చిరంజీవి స్థాయి మ్యూజిక్ ఇవ్వాలని మణి ప్రయత్నిస్తున్నాడట. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ గా భారీ హిట్స్. 'బావగారు బాగున్నారా..?' 'చూడాలనివుంది' 'ఇద్దరు మిత్రులు' 'అన్నయ్య' 'మృగరాజు' 'ఇంద్ర' 'ఠాగూర్' 'అంజి' 'జై చిరంజీవ' 'స్టాలిన్' ఇలా అన్నీ సినిమాలు మ్యూజికల్ భారీ హిట్స్. దీన్ని బట్టి వీరి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అనేది చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం మణిశర్మ ఆచార్య సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనిలో బిజీగా ఉన్నాడట. చిరు సినిమాలకు మణిశర్మ బిజీఎం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. చూడాలి మరి మణిశర్మ మ్యూజిక్ ఆచార్యకి ఏ స్థాయిలో హెల్ప్ అవుతుందో..!