Begin typing your search above and press return to search.

హిట్‌ రిపీట్‌ కాంబినేషన్‌ షురూ

By:  Tupaki Desk   |   18 July 2015 11:52 AM GMT
హిట్‌ రిపీట్‌ కాంబినేషన్‌ షురూ
X
కొన్ని కాంబినేషన్‌లు రిపీటవుతున్నాయంటే అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. అందునా సల్మాన్‌, అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ లాంటి స్టార్ల తో రిపీట్‌ కాంబినేషన్‌ లో సినిమాలు వస్తున్నాయంటే అంచనాలు తారాస్థాయికి చేరతాయి. అలాంటి ఆసక్తి కలిగించే కాంబినేషన్స్‌ గురించి ఈ టాపిక్‌.

షారూక్‌ ఖాన్‌-రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌ లో సినిమా అంటే 'చెన్నయ్‌ ఎక్స్‌ ప్రెస్‌' గుర్తుకొస్తుంది. ఈ సినిమా బాక్సా ఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. దాదాపు 400కోట్లు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌ లో 'దిల్‌వాలే' తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్‌ రూ.75కోట్లు. అంచనాలు 400కోట్లు పైగానే. రికార్డులు తిరగరాస్తుందన్న అంచనాలున్నాయి. డిడిఎల్‌ జె కాంబినేషన్‌ షారూక్‌ - కాజోల్‌ జంట రిపీటవుతుండడంతో అంచనాలు మరింత రెట్టించాయి. 2015 చివరిలో రిలీజ్‌ కానుంది ఈ చిత్రం.

హృతిక్‌ రోషన్‌ -అశుతోష్‌ గోవారికర్‌ కాంబినేషన్‌ లో సినిమా అంటే వెంటనే 'జోదా అక్భర్‌' గుర్తొస్తుంది. అత్యంత భారీ బడ్జెట్‌ తో లావిష్‌ గా తెరకెక్కించిన ఆ చిత్రం సంచలనాలెన్నో సృష్టించింది. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలోనే 'మొహంజోదారో' తెరకెక్కుతోంది. ఇది వచ్చే ఏడాది ఆగస్టు లో రిలీజ్‌ కానుంది.

అక్షయ్‌ కుమార్‌-ప్రభుదేవా కాంబినేషన్‌ అనగానే వాంటెడ్‌ గుర్తు కొస్తుంది. ఆ తర్వాత 'రౌడీ రాధోర్‌'తో మరో హిట్‌ కొట్టారు. ఇదే కాంబినేషన్‌ లో ఇప్పుడు సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌ తెరకెక్కుతోంది. ఈ చిత్రం బాలీవుడ్‌ లో భారీ వసూళ్లు సాధిస్తుందన్న అంచనాలున్నాయి. అక్టోబర్‌ లో ఈ సినిమా రిలీజవుతుంది.

కబీర్‌ ఖాన్‌ -యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ కాంబినేషన్‌ లో 'కాబూల్‌ ఎక్స్‌ ప్రెస్‌', 'న్యూయార్క్‌' వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం 'భజరంగి భాయిజాన్‌' రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. సల్మాన్‌ ఈ చిత్రంలో హీరోగా నటించాడు.