Begin typing your search above and press return to search.

హిట్ 2.. సెన్సార్‌.. ర‌న్ టైమ్ డిటైల్స్ ఇదిగో!

By:  Tupaki Desk   |   26 Nov 2022 10:34 AM GMT
హిట్ 2.. సెన్సార్‌.. ర‌న్ టైమ్ డిటైల్స్ ఇదిగో!
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టించిన యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ 'హిట్ : ద ఫ‌స్ట్ కేస్‌'. శైలేష్ కొల‌నుని ద‌ర్శ‌కుడిగా ప‌రియం చేస్తూ హీరో నేచుర‌ల్ స్టార్ నాని వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ మూవీ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుని విశ్వ‌క్ సేన్ లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీని కొన‌సాగింపుగా రూపొందిన మ‌రో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'హిట్ 2 : ద సెకండ్ కేస్‌'.

యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ ఇందులో హీరోగా న‌టించాడు. దీనికి కూడా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా వాల్ పోస్ట‌ర్ సినిమాపై నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌శాంతి తిపిర్నేని నిర్మించింది. అడివి శేష్ పార్ట్ 2లో న‌టించ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. అంతే కాకుండా రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని మ‌రింత‌గా పుంచేసింది.

మీనాక్షీ చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని డిసెంబ‌ర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. అత్యంత కిరాత‌కంగా హ‌త్య‌లు చేసే సైకో కిల్ల‌ర్‌ని వెతుక్కుంటూ వెళ్లే ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అడివి శేష్ న‌టించిన మూవీ ఇది. ట్రైల‌ర్ తో ఒళ్లు గ‌గుర్పోడిచే స‌న్నివేశాల‌తో ఈ మూవీ సాగుతుంద‌ని క్లారిటీ ఇచ్చేసిన ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ఫైన‌ల్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసింది.

శ‌నివారం ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫైన‌ల్ గా ఒళ్లు గ‌గుర్పొడిచే స‌న్నివేశాలు అత్య‌ధికంగా వుండ‌టంతో సెన్సార్ వారు ఈ మూవీకి 'ఏ' స‌ర్టిఫికెట్ ఇచ్చారు. అంతే కాకుండా ఈ మూవీ ర‌న్ టైమ్ ని కూడా లాక్ చేసేశారు. యాక్ష‌న్ మ‌ర్డ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ ర‌న్ టైమ్ ని 2 గంట‌ల‌కు కుదించారు. సెన్సార్ స‌మ‌యంలో ఈ మూవీలోని మోయిన్ హైలైట్ గా నిలిచే కిల్ల‌ర్ క్యారెక్ట‌ర్ ని చూసిన సెన్సార్ వారు ట్విస్ట్ ని చూసి షాక్ అయ్యార‌ట.

అంతే కాకుండా ఊహిచ‌ని స్థాయిలో సినిమా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో ఊహ‌కంద‌ని ట్విస్ట్ ల‌తో సాగుతుండ‌టంతో ద‌ర్శ‌కుడి టేకింగ్ కి ఫిదా అయిన సెన్సార్ వారు ద‌ర్శ‌కుడు శైలేష్ ని ప్ర‌త్యేకంగా అభినందించార‌ట‌. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీతో హీరో అడివి శేష్ ఏ హీరోకు సాధ్యం కానీ అరుదైన రికార్డుని సొంతం చేసుకోబోతున్నాడు.

క్ష‌ణం సినిమా నుంచి వ‌రుస‌గా 'మేజ‌ర్‌' వ‌ర‌కు ఐదు హిట్ ల‌ని ద‌క్కించుకున్న అడివి శేష్ 'హిట్ 2'తో ఆర‌వ హిట్ ని ద‌క్కించుకుంటే డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ తో అరుదైన ఫీట్ ని సొంతం చేసుకున్న‌ట్టే. మ‌రి ఈ ఫీట్ ని అడివి శేష్ సాధిస్తాడా? లేదా అన్న‌ది తెలియాలంటే డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.