Begin typing your search above and press return to search.

హిట్‌ 2 : ఆ విషయం లీక్‌ అవ్వకుండా చూడగలరా?

By:  Tupaki Desk   |   2 Dec 2022 12:01 PM IST
హిట్‌ 2 : ఆ విషయం లీక్‌ అవ్వకుండా చూడగలరా?
X
అడవి శేష్‌ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మించిన హిట్‌ 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్‌ 1 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిట్‌ 2పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది అంటూ అడవి శేష్‌ మరియు నాని చాలా నమ్మకంగా చెబుతున్నారు. శైలేష్ కొలను మరో అద్భుతమైన క్రైమ్‌ కథతో ఈ సినిమాను రూపొందించారట.

హిట్‌ 2 సినిమా యొక్క సస్పెన్స్ పాయింట్ సినిమాకే హైలట్ గా నిలుస్తుందట. అలాంటి సన్నివేశాన్ని చిత్ర యూనిట్ సభ్యులు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు. అంతే కాకుండా సినిమాలోని కిల్లర్‌ ఎవరు అనే విషయాన్ని కూడా రివీల్ కాకుండా జాగ్రత్తగా ట్రైలర్‌ ను కట్ చేశారు. ఎంత చేసినా కూడా కొందరు జనాలు ట్రైలర్‌ ను చూసి.. పోస్టర్స్ ను చూసి విలన్‌ ఎవరు అనేది ఊహించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

అడవి శేష్‌ హిట్‌ 2 విడుదలకు ముందు వచ్చిన ప్రచారాలను కొట్టి పారేశాడు. మీడియాలో వస్తున్న వార్త కథనాలు నమ్మి సినిమా పై ఒక అంచనాకు రావద్దని పేర్కొన్నాడు. సినిమా విడుదలకు ముందే రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆపడం సాధ్యం అయ్యేలా లేదు. ఎందుకంటే సోషల్‌ మీడియాలో హిట్ 2 విడుదల అయిన వెంటనే విలన్ ఎవరు.. కిల్లర్ ఎవరు అనే విషయాలను పోస్ట్‌ చేస్తూ ఉంటారు.

గతంలో వచ్చిన ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల యొక్క కీ పాయింట్‌ ను రివీల్ చేయడం ద్వారా సినిమాపై జనాల్లో ఆసక్తిని తగ్గించే ప్రయత్నం చేశారు. కనుక ఇప్పుడు హిట్ 2 సినిమా కు కూడా కిల్లర్ ఎవరు అనే విషయం లీక్ కాకుండా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆపగలరా అనేది చూడాలి. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో కచ్చితంగా సస్పెన్స్ విషయాన్ని లీక్ అవ్వకుండా చూసుకోవాలి. మరి అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.