Begin typing your search above and press return to search.

చ‌రిత‌గా ఘ‌న‌త‌గా వెల‌గ‌రా

By:  Tupaki Desk   |   6 April 2022 11:30 AM GMT
చ‌రిత‌గా ఘ‌న‌త‌గా వెల‌గ‌రా
X
మ‌ద‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన చిత్రాలు చ‌రిత్ర‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ లు గా నిలిచాయి. ఇదే ఫార్ములాతో క‌న్న‌డంలో తెర‌కెక్కి దేశ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 1'. య‌ష్ హీరోగా న‌టించిన ఈ చిత్రం సైలెంట్ గా విడుద‌లై మోన్‌స్ట‌ర్ త‌ర‌హాలో ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా సాధించిన వ‌సూళ్ల‌ని చూసి ట్రేడ్ వ‌ర్గాలే నివ్వెర‌పోయాయి. క‌న్న‌డ సీనీ చ‌రిత్ర‌లో ఏ సినిమా దేశ వ్యాప్తంగా ఈ స్థాయిలో సంచ‌లనం సృష్టించ‌క‌పోవ‌డంతో అంతా ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా చూశారు.

ఐదు భాష‌ల్లోనూ క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌శాంత్ నీల్ అంచ‌నాల‌కు అనుగునంగానే ఈ చిత్రాన్ని భారీ ప్ర‌త్యేక‌త‌ల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. సంజ‌య్ ద‌త్ అధీరాగా, ర‌వీనా టాండ‌న్ ప్ర‌ధాని ర‌మికా సేన్ పాత్ర‌లో న‌టిస్తున్నా ఈ మూవీలోని ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప్ర‌కాష్ రాజ్‌, రావు ర‌మేష్ క‌నిపించ‌బోతున్నారు.

శ్రీ‌నిధిశెట్టి హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో క‌న్న‌డ‌,తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌బోతున్నారు. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చార ప‌ర్వం విష‌యంలో మేక‌ర్స్ పై య‌ష్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ విమ‌ర్శ‌ల్ని సీరియ‌స్ గా తీసుకున్న మేక‌ర్స్ 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' రిలీజ్ కూడా ద‌గ్గ‌ర‌ప‌డుతున్న సంద‌ర్భంగా ప్ర‌చార ప‌ర్వాన్ని హోరెత్తించ‌డం మొద‌లుపెట్టారు.

ట్రైల‌ర్ రిలీజ్ కి ముందు 'తూఫాన్ తూఫాన్ ..' అంటూ రాఖీ భాయ్ ని ఎలివేట్ చేసే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేసి ప్రచారాన్ని తుఫాన్ లానే మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం చిత్ర బృందం 'ట్రిపుల్ ఆర్‌' త‌ర‌హాలోనే దేశంలోని వివిధ కీల‌క సీటీల‌ల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తోంది. ఇటీవ‌ల ఢిల్లీలో ప్ర‌త్యేకంగా మీడియాతో ముచ్చ‌టించిన చిత్ర బృందం బుధ‌వారం ముంబై లో ప్ర‌త్యేకంగా మీడియా మీట్ ని నిర్వ‌హించింది.

ఇదిలా వుంటే బుధ‌వారం ఈ మూవీ నుంచి ఓ టెర్రిఫిక్ సాంగ్ కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. 'ఎద‌గ‌రా ఎద‌గ‌రా దిన‌క‌రా..' అంటూ త‌ల్లి పాత్ర రాఖీని ఉద్దేశించి పాడే పాట‌గా దీన్ని విడుద‌ల చేశారు. రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట‌కు ర‌వి బాస‌ర్రూర్ అద్భుత‌మైన ట్యూన్స్ ని అందించాడు. త‌న కొడుకు గొప్ప‌వాడుగా ఎద‌గాల‌ని, జాతికి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటూ త‌ల్లి పాడే ఈ పాట రోమాంచితంగా సాగుతూ సినిమాకు హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని తెలుస్తోంది. రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌లో రాసిన ప‌దాలు కూడా త‌ల్లి కొడుకుల మ‌ధ్య వుండే అనుబంధాన్ని తెలిజేస్తూ ఆక‌ట్టుకుంటున్నాయి.

కేజీఎఫ్ ఎంత యాక్ష‌న్ సినిమా అయినా అంత‌ర్లీనంగా త‌ల్లి గొప్ప‌ద‌నాన్ని చాటి చెబుతూ వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. పార్ట్ 2 లోనే అమ్మ ప్రాధాన్య‌త‌ని, రాఖీ కోసం త‌ను ప‌డిన వేద‌న‌ని గుర్తు చేస్తూ ఓ ఆస‌క్తిక‌ర‌మైన పాట‌ని రూపొందించారు. ఈ పాట కూడా పార్ట్ 2కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచేలా క‌నిపిస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్ ఇప్ప‌టికే మొద‌లై రికార్డులు సృష్టిస్తోంది.