Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: వేట కత్తి ప్రేమ

By:  Tupaki Desk   |   9 May 2019 7:54 AM GMT
ట్రైలర్ టాక్: వేట కత్తి ప్రేమ
X
ఆరెక్స్ 100తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించిన కార్తికేయ హీరోగా రూపొందిన హిప్పి ట్రైలర్ ఇందాక విడుదలైంది. యూత్ ని టార్గెట్ చేసినట్టు ఇంతకు ముందు టీజర్ లో చిన్న హింట్ ఇచ్చిన టీం ఇప్పుడు ఫుల్ క్లారిటీతో ఈ వీడియో రూపంలో తెచ్చేసింది. కంటెంట్ విషయానికి వస్తే జీవితాన్ని సరదాగా అమ్మాయిలతో జల్సాలతో గడిపేస్తున్న ఓ యువకుడు హిప్పి(కార్తికేయ) తను మనసు పడిన అమ్మాయి(దిగంగాన సుర్యవంషి)తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండాల్సి వస్తుంది.

మొదట లైట్ తీసుకున్నా తర్వాత అదే తన జీవితాన్ని మార్చే టైట్ గా మారుతుందని ఊహించని హిప్పి సహాయం కోసం గురువు(జెడి చక్రవర్తి)ని కలుస్తాడు. అసలు బాక్సర్ గా ఉన్న హిప్పి లైఫ్ లో ఇన్ని మార్పులు ఎందుకు జరిగాయి అతనితో సాన్నిహిత్యం కోరుకుంటున్న మరో అమ్మాయి ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే చూడాలి

ట్రైలర్ లో మెయిన్ పాయింట్ ఏంటో రివీల్ చేశారు. కార్తికేయ లుక్స్ పరంగా చాలా మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ ని కంటిన్యూ చేస్తూనే హెయిర్ స్టైల్ ని మార్చుకుని ఏదో కొత్తగానే ట్రై చేశాడు. దిగంగాన లుక్స్ పరంగా బాగానే అనిపిస్తోంది. హీరో ఫ్రెండ్ గా వెన్నెల కిషోర్ కామెడీ భాగాన్ని తలకెత్తుకున్నాడు. జెడి చక్రవర్తి పాత్ర లవ్ గురు తరహాలో వెరైటీగా ఉంది. ట్రైలర్ చివర్లో కార్తికేయ అమ్మాయిని వేట కత్తితో పోల్చే టైమింగ్ పేలింది.

మొత్తానికి యూత్ కి కావాల్సిన లిప్ లాక్స్ కాసిన్ని బోల్డ్ సీన్స్ బాక్సింగ్ రూపంలో యాక్షన్ సన్నివేశాలు కలగలిపి దర్శకుడు టిఎన్ కృష్ణ అన్ని మసాలాలు సరైన పాళ్ళలోనే కలిపినట్టు ఉంది. కలైపులి తాను నిర్మాణం కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తున్నాయి. విడుదల తేది ఇంకా ఖరారు కావాల్సిన హిప్పి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే క్లారిటీ వచ్చేసింది.