Begin typing your search above and press return to search.

ఆరెక్స్ హీరో ట్రైలర్ అప్డేట్ వచ్చిందోచ్

By:  Tupaki Desk   |   8 May 2019 6:42 AM GMT
ఆరెక్స్ హీరో ట్రైలర్ అప్డేట్ వచ్చిందోచ్
X
'RX 100' తో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ తన సెకండ్ సినిమా 'హిప్పి' తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దిగంగనా సుర్యవంశి.. జజ్బా సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో సూర్య సినిమా 'నువ్వు నేను ప్రేమ' ఫేమ్ T.N. కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మార్చ్ లో 'హిప్పి' టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నారు.

ట్రైలర్ ను మే 9 న రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తూ ప్రత్యేకంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్ల జంట సముద్రం ఒడ్డున కూర్చొని సరదాగా గడుపుతున్నారు. హీరోయిన్ ఒక టెలిస్కోప్ లాంటి దాంతో సముద్రం వైపు చూస్తుండగా కార్తికేయ హీరోయిన్ వైపు చూస్తూ ఉన్నాడు. 'హిప్పి' టీజర్లో హీరో కార్తికేయను ఒక రోమియోలాగా చూపించారు. మరి అలాంటి రోమియో క్యారెక్టర్ పై ఎలాంటి కథ ను డిజైన్ చేశారో చూడాలంటే రేపు ట్రైలర్ విడుదల అయ్యేవరకూ వేచి చూడక తప్పదు.

తెలుగు తమిళ భాషలలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని కలైపులి థాను ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మొదటి సినిమాతోనే సంచలన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన కార్తికేయ ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ లో ప్లే బాయ్ లా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించగలడా లేదా అనేది రేపు ట్రైలర్ ను చూసి ఒక అంచనాకు రావచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ..!