Begin typing your search above and press return to search.

ధృవ వస్తున్నాడు.. సౌండ్ అదరాల్సిందే!!

By:  Tupaki Desk   |   2 Sep 2016 1:37 PM GMT
ధృవ వస్తున్నాడు.. సౌండ్ అదరాల్సిందే!!
X
మెగా ఫ్యాన్స్ ఇప్పుడు మాంచి హుషారు మీదున్నారు. వరుసబెట్టి మెగా పండుగలు వస్తుండడం ఇందుకు మెయిన్ రీజన్ గా చెప్పేయచ్చు. చిరు బర్త్ డేతో పండుగ రోజులు స్టార్ట్ అయితే.. ఇపుడు పవన్ పుట్టిన రోజుకు సంబరాలు పీక్స్ కి వచ్చేశాయి. ఇక ఈ జోష్ మరి కొన్నాళ్లు కంటిన్యూ అయిపోవడం ఖాయం. ఎందుకంటారా.. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చేస్తున్నాడుగా!

చెర్రీ-రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న మూవీ ధృవ. తమిళ్ మూవీ తని ఒరువన్ కి రీమేక్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఒరిజినల్ కి స్కోర్ చేసిన జంట మ్యూజిక్ డైరెక్టర్లు హిప్ హాప్ తమళనే పట్టుకొచ్చారు. ఇప్పుడీ సంగీత దర్శక ద్వయం.. ధృవ ఆడియో ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చినట్లు చెప్పేశారు. 'ధృవ ఆడియో పనులు త్వరలో పూర్తి కానున్నాయి. మిక్సింగ్ - మాస్టర్ ప్రస్తుతం జరుగుతోంది. చరణ్ అన్న.. సూరి అన్నలతో పని చేయడం చాలా పెద్ద ఎక్స్ పీరియెన్స్' అని చెప్పారు హిప్ హాప్ తమిళ.

అక్టోబర్ 7న ధృవ రిలీజ్ కు ప్లాన్ చేశారు. అంటే ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ లోనే.. అంటే ఈ నెలలోనే రిలీజ్ అవుతుందన్న మాట. అందుకే మెగా పండుగ సీజన్ ఇంకా నెలకి పైగానే ఉందని చెప్పేది. అంతే కదా మెగా ఫ్యాన్స్!