Begin typing your search above and press return to search.

ధృవ హిట్ అయితే.. కంపోజర్ కి పండగే

By:  Tupaki Desk   |   11 Nov 2016 11:30 AM GMT
ధృవ హిట్ అయితే.. కంపోజర్ కి పండగే
X
రామ్ చరణ్ మూవీ ధృవ.. మెగా ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియో సాంగ్స్.. మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఛార్ట్ బస్టర్స్ లో.. ధృవ ఆడియోలోని అన్ని సాంగ్స్ వినిపిస్తున్నాయంటే.. మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమీజా ఇచ్చిన సంగీతం ఎంతగా క్లిక్ అయిందో అర్ధమవుతుంది.

అయితే రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయకపోయినా డిసెంబర్ 2న ధృవ వస్తాడనే విషయంలో ఇండస్ట్రీ జనాల దగ్గర క్లారిటీ ఉంది. ఇప్పుడు అదే సమయానికి సంగీత దర్శకుడు హిప్ హాప్ ఆది నటించిన 'మీసాయి మురుక్కు' అనే చిత్రం కూడా విడుదల కాబోతోంది. కోలీవుడ్ లో ఈ మూవీపై అంచనాలు బాగానే ఉండగా.. ఈ చిత్రానికి హీరో- డైరెక్టర్ కూడా ఆదినే కావడం విశేషం.

సాధారణంగా టాలీవుడ్ లో తను సంగీతం అందించిన మొదటి సినిమా హిట్ అయితే.. ఆ తర్వాత మరిన్ని క్రేజీ ఆఫర్స్ దక్కించుకునేందుకు సంగీత దర్శకులు ట్రై చేస్తారు. కానీ హిప్ హాప్ ఆది మాత్రం.. తనకు ధృవ సక్సెస్ తో పేరు వస్తే.. మీసాయి మురుక్కును తెలుగులో కూడా రిలీజ్ చేసేసి.. హీరోగా పేరు సంపాదించేద్దామని ఫిక్స్ అయ్యాడట. మెగా పవర్ స్టార్ మూవీకి సంగీతం అందించిన దర్శకుడు అనే బ్రాండ్ గట్టిగానే ఉపయోగపడనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/