Begin typing your search above and press return to search.
తెలుగు స్టార్స్ పాత సినిమాలకు మహర్ధశ
By: Tupaki Desk | 30 July 2020 5:00 AM ISTబాహుబలితో పాటు మరికొన్ని సినిమాల కారణంగా సౌత్ సినిమాల స్థాయి బాలీవుడ్ రేంజ్ లో పెరిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెరిగింది. తెలుగులో విడుదల అవుతున్న ఎక్కువ శాతం సినిమాలు ప్రస్తుతం ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా మూవీస్ గా తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. తెలుగు సినిమాలు అక్కడ థియేటర్లలో కాకున్నా శాటిలైట్ మరియు యూట్యూబ్ లో అయినా విడుదల అవుతున్నాయి.
యూట్యూబ్ లో అల్లు అర్జున్ గత చిత్రాల హిందీ డబ్బింగ్ వర్షన్ లు వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. పలు చిత్రాలు హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తే కోట్లాది మంది చూస్తున్నారు. దాంతో పాటు శాటిలైట్ లో కూడా ప్రసారం చేస్తున్న సమయంలో మంచి స్పందన వస్తుంది. కనుక ఇప్పటి వరకు హిందీలో డబ్ కాని కొన్ని పాత హిట్ సినిమాలను యావరేజ్ సినిమాల డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు హిందీ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
ముఖ్యంగా అల్లు అర్జున్.. ప్రభాస్.. మహేష్.. రామ్.. రామ్ చరణ్ ఇంకా కొందరి సినిమాలను డబ్బింగ్ చేస్తున్నారు. మొన్నటి వరకు వాటిని పట్టించుకోని హిందీ నిర్మాతలు ఇప్పుడు లక్షలకు లక్షలు పెట్టి డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేస్తున్నారు. వాటికి లక్షలు ఖర్చు చేసి డబ్బింగ్ చెప్పించి విడుదల చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నారంటే సినిమాల ద్వారా వారికి భారీ లాభాలు వస్తున్నట్లే.
ఈ సమయంలో టాలీవుడ్ నిర్మాతలు కొందరు తమ పాత సినిమాలకు కాస్త ఎక్కువ కోట్ చేస్తున్నారు. సక్సెస్ అయిన సినిమాలకు డిమాండ్ చేసినంత కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ సినిమాలకు అలవాటు అయిన హిందీ ప్రేక్షకులు పాత వాటిని కూడా వదలకుండా చూసేస్తున్నారు.