Begin typing your search above and press return to search.

శాటిలైట్ అయిపోయింది.. ఇప్పుడు హిందీ రైట్స్

By:  Tupaki Desk   |   4 Jun 2018 8:00 PM IST
శాటిలైట్ అయిపోయింది.. ఇప్పుడు హిందీ రైట్స్
X
మన సినిమాలకు క్రమంగా బిజినెస్ పెరుగుతోంది. గతంలో అంటే థియేటర్ల నుంచి వచ్చినవే డబ్బులు.. ఆడియో రైట్స్ రూపంలో కొంత గిట్టుబాటు అయ్యేది. శాటిలైట్ రూపంలో వచ్చే మొత్తం కూడా అంత భారీగా ఉండేది కాదు. కానీ రోజులు మారాయి.. జనాల టేస్ట్ మారింది.. రేటింగులు మారాయి.

క్రమంగా శాటిలైట్ కు డిమాండ్ పెరిగింది. పక్క రాష్ట్రాలే కాదు.. ఓవర్సీస్ లో కూడా సినిమాలు సత్తా చాటడం మొదలుపెట్టాయి. కొన్ని చిన్న సినిమాలు ఓవర్సీస్ లో కనకవర్షం కురిపించుకునే స్థితి వచ్చింది. ఓ రకంగా ఇవి వరంగా మారాయి. ఈ మధ్య డిజిటల్ రైట్స్ కి కూడా డిమాండ్ పెరిగింది. సినిమాలో సరుకుంటే డిజిటల్ ఫార్మాట్ లోనే భారీగా రాబట్టుకోవచ్చని మేకర్స్ కి అర్ధం అయింది. ఇప్పుడు వీటితో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా కనకవర్షం కురిపించే రోజులు వచ్చేస్తున్నాయి. సినిమాలలో సరుకు ఉన్నా సరే.. మన దగ్గర మాత్రమే వచ్చే బార్క్ జీఈసీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వీటికి రైట్స్ రూపంలో పెద్దగా గిట్టుబాటు కావడం లేదు.

కానీ హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మాత్రం భారీ మొత్తం అందుకునే రోజులు వచ్చేశాయి. సినిమా షూటింగుల టైంలోనే డీల్స్ పూర్తయిపోతుండడం గమనించాలి. కోటి రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్న ఈ హిందీ డబ్బింగ్ మార్కెట్.. గరిష్టంగా 20 కోట్ల వరకూ టచ్ అవుతోంది. కంటెంట్ మేకింగ్ లో క్వాలిటీ చూపించాలే కానీ.. కనకవర్షం కురిపించుకోవడం.. ఇవాల్టి రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదని మేకర్స్ ఫిక్స్ అయిపోవచ్చు.