Begin typing your search above and press return to search.

కరోనా నేపథ్యంలో హిందీ 'అరణ్య' విడుదల వాయిదా..!

By:  Tupaki Desk   |   23 March 2021 2:51 PM GMT
కరోనా నేపథ్యంలో హిందీ అరణ్య విడుదల వాయిదా..!
X
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన త్రిభాషా చిత్రం ''అరణ్య''. ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని హిందీలో ‘హథీ మేరే సాథి’.. తమిళంలో ‘కాదన్’ పేర్లతో మార్చి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే మరో మూడు రోజుల్లో 'అరణ్య' ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకుంటుండగా.. ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

బాలీవుడ్ మార్కెట్ పై ప్రస్తుతం కోవిడ్-19 ప్రభావం కారణంగా హిందీ వర్షన్ ‘హథీ మేరే సాథి’ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయడం లేదని ఈరోస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతానికి వాయిదా వేస్తున్న ఈ సినిమా తదుపరి రిలీజ్ డేట్ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. అయితే దక్షిణాదిలో తెలుగు 'అరణ్య' - తమిళ 'కాదన్' చిత్రాలు మాత్రం ముందుగా అనౌన్స్ చేసినట్లే మార్చి 26న విడుదల అవుతాయని నిర్మాణ సంస్థ పేర్కొంది.

వాస్తవానికి 'అరణ్య' సినిమా గతేడాది1విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ మార్చి 26వ తేదీని లాక్ చేసుకుంది. అయితే నార్త్ లో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా బాలీవుడ్ మార్కెట్ డల్ గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'హథీ మేరే సాథి' చిత్రాన్ని మరోసారి పోస్ట్ పోన్ చేశారు.