Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్: పురందేశ్వరి పాత్రలో ఈ అమ్మాయే

By:  Tupaki Desk   |   22 Sept 2018 7:28 PM IST
ఎన్టీఆర్: పురందేశ్వరి పాత్రలో ఈ అమ్మాయే
X
నందమూరి బాలకృష్ణ టేకప్ చేసిన తెలుగు లెజెండ్ నందమూరి తారకరామారావు బయోపిక్ 'ఎన్టీఆర్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిష్ 'ఎన్టీఆర్' పగ్గాలు చేపట్టినప్పటినుండి జనాల్లో ఈ సినిమాపై ఆసక్తి రెట్టింపైంది. ఇక బయోపిక్ కావడంతో ఎన్టీఆర్ లైఫ్ లో ఉన్న పలు నిజ జీవిత పాత్రలకు సంబంధించిన అప్డేట్స్ తరచుగా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో మరో తెలుగు లెజెండ్ ఎఎన్నార్ పాత్ర పోషిస్తున్న సుమంత్ ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరచింది. అచ్చుగుద్దినట్టు అక్కినేనివారిని దించడంతో ఎఎన్నార్ ముద్దుల మనవడు సుమంత్ ను అందరూ అభినందించారు. ఈ సర్ ప్రైజ్ ను జీర్ణించుకునేలోపే 'ఎన్టీఆర్' కు సంబంధించిన మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి పాత్రను హిమన్సీ చౌదరి అనే అమ్మాయి పోషిస్తుందని వార్తలు వచ్చాయి.

విజయవాడకు చెందిన హిమన్సీ క్లాసికల్ డాన్స్ లో శిక్షణ తీసుకుందట..పైగా నటన పట్ల ఆసక్తి కూడా ఉందట. హిమన్సీ ప్రస్తుతం ఫిలిం యూనిట్ తో జాయిన్ అయ్యి షూటింగ్ లో కూడా పాల్గొంటోందని సమాచారం. ఇక రియల్ రీల్ పురందేశ్వరి గెటప్ లో ఉన్న హిమన్సీ పురందేశ్వరి తో కలిసి తీయించుకున్న ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ కు పురందేశ్వరి తో చాలా క్లోజ్ గా ఉండేవారట. మరి నందమూరి తండ్రీ కూతుళ్ళ ప్రేమను క్రిష్ ఎలా వెండి తెరపై ఆవిష్కరిస్తారో వేచి చూడాలి.