Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్'తో నటించడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తున్న 'బిగ్ బాస్ బ్యూటీ'..!

By:  Tupaki Desk   |   24 May 2020 7:07 AM GMT
బిగ్ బాస్తో నటించడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!
X
హిమజ.. తన అందంతోనే కాదు అభినయంతోనూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోన్న ముద్దుగుమ్మ. 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో సీజన్ - 3 లో తనదైన శైలిలో ఆడుతూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. హిమజ అటు బుల్లితెర మీద కనిపిస్తూనే ఇటు వెండితెరపై కూడా మెరిసింది. 'ఉన్నది ఒకటే జిందగీ' 'నేను శైలజ' 'నెక్స్ట్ నువ్వే' 'ధృవ' 'మహానుభావుడు' 'స్పైడర్' ఇలా చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది హిమజ. సినిమాలు, టీవీ సీరియల్స్ అంటూ బిజీగా గడుపుతోన్న సమయంలో హిమజకి 'బిగ్ బాస్' సీజన్ 3లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ షో నుండి బయటకి వచ్చిన తర్వాత హిమజ క్రేజ్ మారిపోయింది. ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టీవ్‌ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడూ తన ఫోటోస్‌ పోస్ట్ చేస్తూ అభిమానులకు చేరువ అవుతోంది. అంతేకాకుండా ఇప్పుడు ఒక క్రేజీ ఆఫర్ దక్కించుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ.

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో నటించాలని అందరు కోరుకుంటూ ఉంటారు. చిరు పక్కన కనీసం ఒక్క చిన్న పాత్ర అయినా చేయాలని అంతా అనుకుంటారు. అలాంటి ఛాన్స్ మన హిమజా దక్కించుకుంది. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో హిమజ ఒక రోల్ ప్లే చేయబోతోంది. చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్‌ దక్కించుకున్న హిమజా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాలని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా పరిస్థితులన్నీ మారిపోయి షూటింగ్‌ ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడి షూటింగ్‌ మళ్లీ ప్రారంభం అయిన వెంటనే హిమజా 'ఆచార్య' చిత్రీకరణలో పాల్గొననుంది.

హిమజ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తాను మెగాస్టార్‌ చిరంజీవి మూవీలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. షూటింగ్‌ ప్రారంభం అయిన వెంటనే తన పార్ట్‌ షూట్‌ ఉంటుందని ఇన్ఫర్మేషన్‌ వచ్చిందని చెప్పింది. మెగాస్టార్‌ మూవీలో నటించడం వల్ల ఖచ్చితంగా మంచి మైలేజ్‌ వచ్చి రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లు వస్తాయనే నమ్మకంతో ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు బుల్లి తెర షోల్లో నటించడంతో పాటు.. సీరియల్స్‌ లో కూడా మెరుస్తూ వస్తోంది. మరి మెగాస్టార్ సినిమా తర్వాత ఈ బిగ్ బాస్ బ్యూటీ కెరీర్ ఎలా టర్న్ అవబోతుందో చూడాలి.