Begin typing your search above and press return to search.

వీడియో : నాగ్‌ పై హిమజ షాకింగ్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   1 Oct 2019 12:54 PM GMT
వీడియో : నాగ్‌ పై హిమజ షాకింగ్‌ కామెంట్స్‌
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 క్లైమాక్స్‌ కు చేరింది. మరో నాలుగు అయిదు వారాల్లో షో ముగియబోతుంది. మొదటి వారం మినహా ఆ తర్వాత ఏ ఒక్క వారం కూడా రికార్డు రేటింగ్‌ ఏమో కాని కనీసం సీరియల్స్‌ కు వస్తున్న రేటింగ్‌ రావడం లేదు అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. నాగార్జున హోట్టింగ్‌ తో షో స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం అనుకున్నారంతా. కాని మొదటి రెండు సీజన్‌ లతో పోల్చితే మూడవ సీజన్‌ రేటింగ్‌ చాలా తక్కువ వస్తుంది. కనీసం వీకెండ్‌ ఎపిసోడ్స్‌ అయినా ఆసక్తిగా సాగడం లేదు. వీకెండ్‌ ఎపిసోడ్స్‌ లో నాగార్జున ఏమాత్రం ఆకట్టుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

షో డైరెక్టర్స్‌ రాసి ఇస్తున్న స్క్రిప్ట్‌ ను మాత్రమే నాగార్జున చదువుతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై గత వారం ఎలిమినేట్‌ అయిన హిమజ కూడా చెప్పుకొచ్చింది. షోను నాగార్జున గారు చూడకుండానే డైరెక్టర్స్‌ ఎలా చెబితే అలా నడిపిస్తున్నారు. షోను రెగ్యులర్‌ గా ఫాలో అవ్వడం లేదనే అనుమానం నాకు ఎలా వచ్చిందంటే.. మొదటి వారం నాకు హేమ గారికి ఇష్యూ జరిగినప్పుడు నన్ను ఎందుకు ఏడ్చావమ్మా అంటూ ప్రశ్నించాడు.

ఆ సమయంలో నాకు బాధ వేసింది. ఎందుకు ఏడ్చావని నన్ను అడగడం ఏంటీ.. మీరు షో చూస్తే మీకే అర్థం అవుతుంది. అక్కడ తప్పు ఎవరిది అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. షో చూసి ఉంటే నాగార్జున గారు హేను మీరు హిమజను ఎందుకు ఏడిపించారు అంటూ ప్రశ్నించే వారు. ఆయన డైరెక్టర్స్‌ హెడ్‌ ఫోన్స్‌ లో చెప్పిన విధంగా నడిపిస్తూ ఉన్నాడంటూ హిమజ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయిన ప్రతి ఒక్కరు కూడా నాగార్జున హోస్టింగ్‌ పై పాజిటివ్‌ గా రియాక్ట్‌ అయ్యారు. కాని హిమజ మాత్రమే ఆయన షో చూడకుండానే హోస్టింగ్‌ చేస్తున్నాడంటూ విమర్శలు చేసింది.